పుట:Kasiyatracharitr020670mbp.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిశ్రమమయినదనిన్ని పుణ్యము నిర్గుణ బ్రహ్మసంబంధ మయినదనిన్ని పాపము సంకల్పద్వారా స్పష్టమయిన మాయ సంబంధమయిన దనిన్ని ఈరెండున్ను కలిసి ప్రపంచము నిర్మించబడ్డది గనుక ఎట్టి మంచిపనిలో నున్ను చెడుకలిసి యుంచున్నది. అందుకు దృష్టాంత మే మంటే హిందువులు మూఢులకున్ను, బాలులకున్ను దైవమందు భక్తి కలిగే నిమిత్తమయి బింబాల యెడల దైవత్వమును ఆరోపించుటచేత పరిపక్వ కాలాలయందు కూడా ఆ నమ్మికె నిలవబడి మనుష్యకోటిని ముంచివేయుచున్న దనిన్ని, తద్వ్య్హతిరిక్తముగా విలాయతీ క్రీస్తు మతస్థులు ఈశ్వర స్వరూపము సర్వభూతాత్మక మని ఆదిలోనే బోధచేయు తలచుట చేత మూఢులున్ను, బాలులున్ను ఈశ్వరుడు కలడనే జ్ఞానమే లేక మణిగి పోతారనిన్ని, హిందువులు ద్వితీయ వివాహము స్త్రీలకు లేక చేసుట చేత బహుమంది బాల్యమున విధవలయిన స్త్రీలు మిక్కిలి కష్టపడు చున్నారనిన్ని దానికి వ్యతిరిక్తముగా యింగిలీషు జాతి వారు స్త్రీలకు ద్వితీయ వివాహానికి అనుజ్ఞ యిచ్చుటచేత స్త్రీలకు చాపల్యము సహజముగా నుండబట్టి స్వపురుషునియెడల భయభక్తులు తక్కువయి వాణ్ని కృత్రిమముచేత చంపి వేరే పురుషుని వివాహము చేసుకొను చున్నారనిన్ని ఒక మంచిని ఊహించితే ఒక చెడు ప్రపంచ స్వభావద్వారా ఆ మంచిలో జనింపుచున్న దనిన్ని యివి మొదలయిన హేతువులచేత చెడు కలియని మంచి పని ప్రపంచములో లేదనిన్ని నిశ్చయించినాము. పయిగా ఈయనేక జగత్తుల సృష్టిని పరబ్రఃహ్మ తన చిద్విలాసార్ధ మయి చేసి నందున ప్రతిదేహానికిన్ని ప్రకృతి వేరువేరుగా నున్నది. ప్రకృతి భేదము మనసువల్ల జనిత మయినది. మనస్సు బుద్ధి జనిత మైనది. కాష్టములో అగ్ని ప్రవేశించి యున్నట్టు బుద్ధిలో పరమాత్ముని చైతన్యము ప్రతి ఫలించియున్నది. కాష్టభేదములు అనేక భేదములయి నట్టు బుద్ధిభేదములు అనేకములుగా నుంచున్నవి. ఒకరాజుకు అధీనములుగా అనేక మండలాలు ఉండుటకు బదులుగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రాజూ ఉండినట్టయితే బుద్ధి భేదముల చేత