పుట:Kasiyatracharitr020670mbp.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

నాలుగు జాము లయితే మరి యొకటి రెండుజాములై యుంచున్నది. ఈరీతిగా న్యాయశాస్త్రమున్ను దేశానుగుణముగా స్మర్తులు ఏర్పరచి యున్నారు. అది యెట్లావంటే నిండు దక్షిణ దేశములో స్త్రీచాపల్యము విస్తారము గనుక తొడబుట్టిన దాని కొడుకు నిశ్చయముగా రక్తసంబందంధికుడని తెలుసుగదా! రక్తసంబంధికుడని తొచే కుమారుని కన్నా రక్తసంబంధికుడని తెలిసిన మేనల్లుడే మేలని తోడబుట్టు కొడుకే ధనానికిన్ని, కుమారునికిన్ని అధకారిగా చేయబడినాడు. నిండు ఉత్తరదేశములో స్త్రీ చాపల్యము తక్కువ గనుక "శరీరాధ్యంస్మృతా జాయా" స్మృ తి ప్రకారముగా అవిభక్త విషయములో బహుమంది అన్నదమ్ములున్నూ భార్యకు పతి సొత్తును గురించి అర్హత కద్దనినియమించ బడి యున్నది. మధ్య దేశములో స్త్రీల విషయముగా చాపల్యము మధ్యమముగా నున్నది గనుక పుత్రద్వారా సొత్తులో సకల స్వాతంత్ర్యమున్ను వారికి కలగచేసి అపుత్రవిషయములోనున్ను అవిభక్త విషయములో నున్ను పోషణకు మాత్రము వారికి అర్హత కలగ చేసి సొత్తును అన్నదమ్ములకు యిచ్చినారు. మెట్టుకు దేశాచారము లంతా శాస్త్రానికి, యుక్తికిన్ని విరుద్ధములుగా నుండవు గనుక అన్యదేశస్థులపట్ల వారి యాచార వ్యహారములు, అలంకారములు, ఆహారాదులున్ను భిన్నములుగా నున్నా వారియందు భక్తి విశ్వాసములను ఉంచి వారున్ను ఈశ్వరసృష్టితో చేరినవారు గనుక మనయొక్క అన్నదమ్ముల వలెనే సకల విషయములలో నున్ను వారిని విచారింపుచు రావలసిన దని తోచుచున్నది.

నాగపూరు షహరున్ను యింగిలీసు దండువుండే కామిటి అనే ప్రదేశమున్ను బహునల్ల రేగడభూమి; వర్షాకాలములో అట్టిభూమి యందు సంచరింఛే వాడికె లేనివారు చూస్తే అది బహు అసహ్యముగా తోచబడును, వర్షాకాలములో వీధులున్ను, సందులున్ను కాలు పెట్టడానికి యోగ్యములుగా నుండవు. శీతాబులిడెలోనున్ను, కామిటిలోనున్ను జాతులవారు మాత్రము గులకరాళ్ళు కలసిన ప్రదేశముగా చూచి శీతాబులిడిలో కొంఢ సమీపముగా నున్ను, కామిటీనది