పుట:Kasiyatracharitr020670mbp.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయములో బహు శ్రేయస్సు గలిగేలాగు తోచుచున్నది. కుంఫిణీ వారు దొరతనములోగాని న్యాయవిచారాణలోగాని యెంతమాత్రము సంబంధపడి యుండలేదు. మారుజాతివారు కొందరు గోసాయిలున్ను యిక్కడ కోఠీలు వేసుకొని సాహుకారు పనులు గడుపుచున్నారు. ఒక మాత్రపు రత్న వర్తకమున్ను వీరివల్లనే జరుగుచున్నది. రాజునగిరిలో మాత్రము రెండు దేవాలయాలు అలంకారముగా కట్టియుంచి పూజ జరిగింపబడు చున్నది గాని మరియెక్కడను లేదు. నాలుగు సత్రాలలో రాజు అన్న ప్రదానము నిత్యము నూటికి జరిగింపుచున్నాడు. అధ్యయన పాఠశాలలు లేవు. అధ్యయనము వినవలసి యుంటే ఆ జ్ఞాన నిమిత్తమై యిక్కడ వచ్చియుండే మధ్యదేశ బ్ర్రాంహ్మణుల గుండా వినవలసినది. యీదేశస్థులు హరికధ చేయడము చేయించడము వలన ఇహ పరాలు సాధించేటట్టు నాకు తోచుచున్నది. హయిదరాబాదు మొదలుగా కట్టియుండే దేవాలయాలలో నంతా ఒక గర్బగృహమున్ను తగుపాటి ముఖమంటపమును అరటిపువ్వు చందముగా నొక స్థూపిన్ని నిర్మంపబడి యున్నది.

ఈ దేశస్థులయొక్క ఆచారము మన దేశానకు యోగ్యము గాకున్నా శాస్త్రసమ్మత మైనదే కాని వేరే కాదు. ఆచారాలు, అలంకారాలు, ఆహారాదులున్నూ దేశానికి తగినట్టుగా పెద్దలు స్మృతుల గుండా యేర్పరచి యున్నారు. అది తెలియక ఒక దేశస్థులు మరియొక దేశస్థులను అన్యాయముగా నిందింపు చున్నారు. ఇందుకు దృష్టాంత మేమంటే యీ దేశములో భోజనానికి దృష్టి దోషమున్ను, ఉదకానికి స్పర్శదోషమున్ను అక్కర లేదని అంగీకరించి అలాగే నటింపు చున్నారు. అయితే అందువల్ల విరోధమేమి? బ్ర్రాంహణులు పరిషేచనము చేయడము దృష్టి దోషము పరిహారమయ్యే కొరకే కదా? అటుగా దృష్టిదోషము కలదిని పాటింఛే పక్షమందు పరిషేచన విషయమైన ఆపస్తంబ సూత్రము వ్యర్ధమవుచున్నది. అయితే ప్రధమములో శూద్రదృష్టి కూడదని ఒక వచనము ప్రవతించి వున్నది గనుక అది పట్టుకొని పిమ్మట ఆపస్తంబులు సూత్ర ద్వారా