పుట:Kasiyatracharitr020670mbp.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరిషేచన ప్రకరణము కలగచేసినా పరిషేచనమునున్ను చేయుచు శూద్రదృష్టిన్నిలేకుండా దేశమునేలే ప్రభువుల ఆదరణచేతను మధ్యదేశపు బ్ర్రాంహ్మణులు వగయిరాలు జరుపుకొనుచు వచ్చు చున్నారు. వృధివ్యప్తజోనాయ్వ్యాకాశాలు బ్రంహ్మాండానికి పంచమహాభూతాలయి యుండగా అన్నిటిని పరిశుద్ధి చేయగల జలమునకు దోషమెక్కడిది? ఒక గుంటలో సకల జారులున్ను నాల్గు రేవులలో దిగి సమకాలమందు స్నారము చేయలేదా? ఉదకము కొద్దిగానుండి స్పర్శదోషము పాటింపవలెనని చెప్పే పక్షమందు అప్పుడు సమమయిన భూతముగానుండే అగ్నికిన్ని ఆ దోషము చెప్పవచ్చునే? అగ్ని మాత్రము యెంత కొంచమైనా యెవరు తాకినా అంటు దోషల్ల్ములేక్ పోవలసిన దేమి? యిక్కడిక యాచారానికి ప్రతిగా మధ్య ద్రావిడ దేశములో పర్యుషితాన్నముతింటే పునరుపనయనము కావలసినదనిన్ని చింతపండు;తో మిరియాలు కలిసి పచనమయితే సురతో సమాన మనిన్నీ శాస్త్రము ప్రవర్చించియుండగా ఈ రెండున్ను లేకపోతే ఉష్ణవాయువు భూమిలో వసించేవారు చచ్చిపోదురు గనుక అవతార పురుషు డయిన అప్పయదీక్షితులు ఆ పదార్ధ భక్షణణకు అనుజ్ఞ ఇచ్చినారనే బలమునుబట్టి దక్షిల్ణదేశశ్థులు వాటిని పుచ్చుకొనుచున్నారా? లేదా? ఇతర దేశస్ధులు ఆ పదార్ధాలతో తమకు నిమిత్తము లేదు గనుక అహ్యాపి వాటిని నిషేధించే యున్నారు. కర్మద్వారా జ్ఞానము చంపాదించవలసి యున్నది గనుకనున్ను, కర్మములకు నియమములేక పూర్తికాదు గనుకనున్ను నానా విధములయిన్ నియమాలను ఆయాదేశములకు అనుగుణముగా స్మత్రలు ఏర్పరచినారు. ఇటువంటి ఆచారాలకు వచనాలచేతనే ప్రవృర్తిల్ నివృత్తులు కలుగవలసియున్నవి. యీ నియమాలన్ని వృధ్దాచారమువలన అనుసరించుటఛేత మనోబంధకము లయినవి. అందుకు దృష్టాంతముగా కొందరి యాచార మే మంటే నిన్నటి మడుగువస్త్రము నేటి దేవతార్చనకు పనికివచ్చునని దరింపుచున్నారు. కొందరు నాటి మడుగు వస్త్రమే కావలె ననుచున్నారు. ఇందులొ నేమి భేదము? ఒక వస్త్రము ఉతికి ఆరవేసి