పుట:Kashi-Majili-Kathalu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11]

పుండరీకుని కథ

81

లెట్టి పుణ్యము సేసికున్నవో? ఇట్టి లోకైకసుందరి ననివార్యముగాఁ జూడఁగలిగినవి. అయ్యారే! నిరించి సర్వరమణీయవస్తువులనేరి యీ నారీరత్నమును సృజించెనని తలంచెదను. ఓహోహో! అక్క మలగర్భుండు రూపాతిశయపరమాణువుల నిన్నిటి నెక్కడ సంపాదించెనో? తెలియదు.

నిక్కమీకాంచనఁగాత్రిని నిర్మించుచున్న విరించనుని కరతల పరామశన్‌శ్లేశంబున నామె కన్నులనుండి జారిపడిన జలబిందువుల నుండియే భూమియందుగల కుముద కమలసౌగంధికాది వస్తువులుత్పన్నంబులైనవి. బాపురే! ఇపూఁబోడి మోమంతయుఁ గన్నులుగానే కనంబడుచున్నది? ఇది కొమ్మయా? బంగరుబొమ్మయా? అని విత్కరించుచున్న యన్నరనాధసూనుని దృష్టిప్రసారము కాదంబరీ నయన యుగంబున వ్యాపించినది.

అమ్మదవతియు నదరుపాటుతో నతనింజూచి రూపాతిశయ విలోకనమువలనం గలిగిన విస్మయముచే రెప్పవాల్పకుండ సూటిగాఁ జూపులతనిపై వ్యాపింపఁజేసినది. తల్లోచన ప్రభావ్యాప్తిచేఁ దెల్లఁబడి కాదంబరీ దశ౯న విహ్వలుండై యతండు కాదంబరీ దశ౯న విహ్వలుండగు బలరామునివలెఁ బ్రకాశించెను.

కాదంబరి యట్లా రాజపుత్రు నబ్బురపాటుతోఁజూచి మేను గగుర్పొడువ భూషణరసమేసార నట్టెలేసి మేనెల్లం జెమ్మటలుగ్రమ్మఁ గంపముతో నతికష్టంబునఁ గొన్నియడుగు లెదురువోయి చిరకాల దశ౯సమువలనఁ గలిగినయుత్కంఠతో నాకలకంఠినిఁ గంఠాశ్లేషము గావించినది.

మహాశ్వేతయుఁ బ్రత్యాశ్లేషము గావించుచు సఖీ! ఈతండు రక్షిత ప్రజాపీడుండగు తారాపీడుండను భూలోకచక్రవర్తి కుమారుండు నిజభుజాస్తంభ విశ్రాంత విశ్వంభరాపీడుండు చంద్రాపీడుండను