పుట:Kashi-Majili-Kathalu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తారాపీడుని కథ

29


సవరించుకో. జవ్వనీ! ఏమి నీయౌవనమదము నన్ను నొక్కిస్రుక్కఁ జేయుచుంటివి. వెనుకకు జరుగుము.

  • సిగ్గులేనిదానా! కట్టినదుకూలము జారుచున్నది చూచుకొమ్ము.
  • మత్సరురాలా! ఎంతసేపు చూచెదవు? నీకుకాని యితరులకు వేడుక లేదనుకొంటివి కాబోలు తొలగి నాకుఁ జోటిమ్ము.
  • అమ్మా! కాణాచివి. నీవే ముందరకు రమ్ము.
  • నీవొక్కరితవే గవాక్షమరికట్టితి వెట్లు?
  • ఓహోహో! నీ మిధ్యావినీతత్వ మెఱింగితినిలే. ఈవారచూపు లేల? విస్రబ్థముగాఁ జూడుము.
  • ముగ్ధురాలా! మదనజ్వరపులకజాలము మేనం బొడమినది. కప్పికొనుము.
  • అనంగపరవశురాలా! నాకట్టిన వస్త్రము నుత్తరీయముగాఁ బూనుచుంటివి విడువుము?
  • శూన్యహృదయురాలా! నీవిప్పు డెక్కడ నుంటివో తెలిసికొన లేకుంటివే?
  • అత్తగారు చూచి యాక్షేపించుననియా? పరుగిడి లోపలికి బోవుచుంటివి?
  • లఘుమతీ! రాజపుత్రుం డవ్వలకుఁ బోయెఁ గన్నులం దెరవుము.
  • ఓహో! పతివ్రతాశిరోమణీ! చూడఁదగిన వస్తువుల జూడక నీకన్నుల వంచించుచుంటివిగదా!
  • ప్రియసఖీ! పరపురుష దర్శనపరీహారవ్రతము విడిచి త్రిలోక మోహజనకుండు రతివిరహితుండు నగృహీతమకరధ్వజుండు నగు నీ మకరధ్వజు నీక్షింపుము. ధన్యురాల వగుదువు.

ఆహా! ఆమోము అయ్యారే? ఆతళ్కు జెక్కులు, బాపురే?