పుట:Kashi-Majili-Kathalu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

కాదంబరి


ఆబాహువులుఁ భళిరే! పేరురంబు. ఈ సుకుమారునిఁ బుత్రునిగాఁ గనిన విలాసవతి యెంతధన్యురాలో వీనిం భత౯గాఁ బడయఁబోవు పూవుఁబోడి యెంత తపంబు గావించినదియో? అని యంతఃపుర కాంతలెల్లస్తుతియింపుచుండఁ జిత్రగమనంబులఁ బెక్కండ్రు వారు నపురౌఁతులు చుట్టునుం బరివేష్టించి నడుచుచుండఁ గ్రమంబునఁ బోయిపోయి యాస్థాన సమీపమున కరిగి ద్వారదేశమునందే గుఱ్ఱమును దిగి వైశంపాయనుని కైదండఁ గైకొని బలాహకుఁడు వినయముతో ముందు నడచుచు దారిజూపుచుండఁ గక్షాంతరములు గడచి కైలాసగిరి విలాసమునం బ్రకాశించు గృహసభామంటపంబు చేరంజని యందు,

సీ. కనకవేత్రములఁ గైకొని దర్పము దలిర్ప
              ద్వారపాలురు బరాబరులు సేయ
    ఆహిదీప్త పాతాలగుహలట్లు పొలుచు నా
              యుధశాలలను యోధులోలగింప
    జము నోలగమున నొజ్జల వోలెఁ దగులేఖ
              కులు శాశన సహస్రములు లిఖింప
    క్షితినాధ దర్శనాగతపర్వదేశభూ
              పతితతిస్తవ రవార్భటులు సెలఁగ.

గీ. వేశ్యలిరువంక చామరల్ వీచుచుండఁ
    గవులు గాయక వందిమాగధ విబూష
    కులు భజింపఁ నిలింపయుక్తుఁడు మహేంద్రు
    కరణిఁ గొలువున్న ధరణీంద్రుఁ గనియె నతఁడు.

కర వినమ్రుఁడై నమస్కరించుచున్న పుత్రుం జూచి తండ్రీ! రమ్ము రమ్మని చేతులు సాచుచు నానందబాష్పపూరిత లోచనుండై రాజు మేనం బులక లుద్భవిల్ల పుత్రుం కౌగలించుకొనియెను.