పుట:Kashi-Majili-Kathalu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కాదంబరి

తిరిగివచ్చినవి. శరీరమున దారుఢ్యము గలిగినది. పిమ్మట నన్నొక చెట్టునీడ నిలిపి తాను స్నానము గావించి నిర్వర్తితనిత్యక్రియాకలాపుండై యమ్ముని కుమారుండు మిత్రవర్గముతో జలమువెడలి నన్నొకచేత బట్టికొని తన యాశ్రమమునకుఁ బోయెను.

అధికమహిమాస్పదంబగు నయ్యాశ్రమమున గురుతరయోగ నిష్ఠాగరిష్ఠుండై యున్న జాబాలిం జూచి నేనంతర్గతంబున నిట్లుతలంచితిని.

ఆహా తపఃప్రభావము! ఈమునిమార్తాండుని యాకారము శాంతమయ్యు మెఱపుతీగెయుఁబోలెఁ జూట్కులకు మిరుమిట్లు గొలుపుచున్నయది. ఇమ్మహర్షి యుదాసీనుండైనను ప్రభావసంపన్నుఁడగుట మొదటఁజూచినవానికి వెరపుగలుగకమానదు. మహాత్ముల నామము స్మరించినంత నెట్టిపాపములైనం బోవుననుచో దర్శనమునవచ్చు సుకృతము మాట జెప్పనేల? సకలవిద్యలు నీ మహర్షిముఖమున నటించుచున్నయవి. అన్నన్నా? ఈముదిమి కెంత భయములేదో యా మహానుభావుని జటాకలాపమును సైతము తెలుపుజేసినది. తేజశ్శాలులలో నీతండగ్రేసరుఁడు. ఈ ముని కుంజరుఁడు కరుణారసప్రవాహము. సంసార సముద్రమునకు సేతువు, సంతోషామృతసారము, శాస్త్ర రత్నములకు నికషపాషాణము, ఈ పుణ్యాత్ముని తపోమహిమచేతఁ గదా! మృగములిందు జాతివైరముమాని సంచరింపుచున్నవి. అయ్యారే? మహాత్ముల ప్రభావము ఎంతవిచిత్రమైనది. అని పెక్కుభంగుల నతని మహిమ నభినుతించుచున్న సమయంబున నన్నాహరీతకుఁడు రక్తాశోకతరు మూలమునకుం దీసికొనిపోయి యొకచోట నిలిపి తండ్రికి నమస్కరించి తానొక మూలఁ గూర్చుండెను.

అప్పు డచ్చటనున్న మునులు నన్నుఁజూచి శంకించుచు దీని నెచ్చటనుండి తెచ్చితివని హరీతకు నడిగిన నతండిట్లనియే