పుట:Kashi-Majili-Kathalu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిలుక కథ

15

లెక్క సేయని పాతకమునన్నిట్లు బాధింపుచున్నది కాబోలు అయ్యో! జలములు దాపునలేవు. నాలుక యెండిపోవుచున్నది. నడువలేను. వనభూమియంతయు నాతపముచేఁ దప్తమైయున్నది. దాహమునకు నిమిషము తాళజాలను. చూపులకుం జీకటిగ్రమ్ముచున్నది. కటకటా! విధియెంతఖలుఁడో నాకు వేగము మరణమైనను గలుగజేయ కున్నాఁడని యనేకప్రకారములఁ దలపోయుచుంటిని.

ఆ ప్రాంతమందు జాబాలియను మహర్షి యాశ్రమముగలదు. అతనికుమారుఁడు హతీతకుండనువాఁడు. సకలవిద్యాపారంగతుండు. సవయస్కులగు మునికుమారులతోఁ గూడుకొని రెండవమార్తాండుని వలె దపస్తేజంబున వెలుంగుచు నమ్మార్గంబున స్నానార్ధమై పంపా సరస్సునకుఁ బోవుచు దాహపీడితుఁడనై నోరు తెరచుకొని దారిలో నొగర్చుఁచుఁ బడియున్న నన్నుఁజూచెను.

సత్పురుషుల హృదయములు కరుణాబంధురములు గదా! అట్టి యవస్థతోనున్న నన్నుఁజూచి యమ్మహాత్ముం డంతరంగంబునఁ బరితపించుచుఁ దోడిమునికుమారునితో వయస్యా! అటు చూడుము, ఆ శుకపోతము అజాతపత్రమై తలవాల వైచుకొని యున్నది. శ్యేనాదికము దీనిం బాధింపఁబోలు. దీని ప్రాణములు కంఠగతములై యున్నవి. నీటికొరకుఁగాబోలు మాటిమాటికి నొగర్చుచు నోరుదెరచుచున్నది. పాపము దీని ప్రాణములు వాయకమున్న జలప్రదేశమును జేర్పుదము లెమ్ము. దీని ప్రాణములు కాపాడిన కడుపుణ్యము రాగలదని పలుకుచు మెల్లన నన్ను మృదులమగు హస్తములతోఁ బట్టికొని యా సర స్త్సీరము జేర్చి దండకమండలము లొకచోటం బెట్టి యతి ప్రయత్నముతో ముక్తాఫలంబులంబోని జలబిందువులఁ గొన్నిటి నా నోటం బోసెను.

అప్పుడు నామేనంతయుఁ జల్లబడినది. పోయిన ప్రాణములు