పుట:Kashi-Majili-Kathalu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

119


రాలేదు. నేనే నీచేత నామెకు సందేశము పంపుచుంటిని. అళీకమగు సిగ్గుయొక్క భారమును వహించుటచే నిన్నాయాసపెట్టుచున్నాను. అని దేవితో విజ్ఞాపన చేయుము. తక్కినసంగతులన్నియుఁ బత్రలేఖ యెఱిగింపఁగలదు. అని పలుకుచు నమంగళశంకచే నశ్రుజలంబు నరికట్ట యత్నించుటయు నాపలేక కన్నీరు గార్చుచుఁ దన పాదంబులకు నమస్కరింపుచున్న పత్రలేఖ దిక్కు మొగంబై యంజలి పట్టి యిట్లనియె.

పత్రలేఖా! ఈయంజలితో మత్సిరప్రణామము లర్పించి కాదంబరి కిట్లు విజ్ఞాపనజేయుము. దయగలదగుట ప్రధమదశ౯నమందే యనుగ్రహాతిశయమును జూపిన యాపెను నమస్కారముచేతనైన గౌరవింపక విడిచివచ్చిన కృతఘ్నుండ నగు నాసుగుణ మేదిజూపి తిరుగాఁ బరిగ్రహింపు మని ప్రార్ధింతును. ఆమెమాత్ర మెట్లంగీకరించును? ప్రకృతిపేశలమగు నామె హృదయమపహరించి వెళ్ళ లేదనియా? ప్రాణసంకటమగు నవస్థ జూచియు నుపేక్షచేయలేదనియా? సర్వదోషాశ్రయుఁడనైనను బలుమారామె పాదసేవ జేసితిననియా? సర్వగుణహీనుండనైనను నామె సుగుణంబులే నన్నవలంబించు నని యాసగలిగి యుంటిని. పాదపతితుండ నగు నన్ను దద్వాత్సల్యము భయపెట్టఁదని తలంతును. సిగ్గులేనివాఁడనై తిరుగా నామె మొగంబు జూచుటకు యత్నించుట తత్సుగుణంబులే కారణములు. ఆమె సెలవులేకయే దూరముగా వచ్చిన నన్ను బలాత్కారముగాఁ దత్సుగుణములే వెండియు నామె పాదమూలమును జేర్చు చున్నవి. ఇష్టములేని గమనాజ్ఞాచే వెడలిపోయితినని యేవాక్కుచే విజ్ఞాపనజేసికొనుచుంటినో? ఆవాక్కే నీకిట్లు చెప్పుచున్నది. ఇటుపైన మదాగమన మెట్లు వ్యధ౯ముగాదో జగమెట్లు శూన్యముగాదో యట్లు దేవి యాత్మనిలుపుకొనుట కాత్మచేతనే యత్నముచేయ