పుట:Kashi-Majili-Kathalu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

కాదంబరి


నన్నరయుట కై వెడలి పుడమియంతయుఁ ద్రవ్వుదురె. అట్టివారిం గష్ట పెట్టుట నాకేమి శ్రేయము? పోకున్నఁ గాదంబరి ప్రాణత్యాగము చేయును. ఱెండు విధంబులచేతఁ బ్రత్యవాయమే తోచుచున్నది యేమిచేయుదును? ఎవ్వరితోఁ చెప్పుదును? ప్రాణతుల్యుండగు వైశంపాయనుం డైన దావునలేడే? యని యనేకప్రకారములఁ దలపోయుచు నారాత్రి నెట్ట కేలకుగడిపెను.

అతండు మరునాఁడుదయంబున లేచి స్కంధావారము సమీపమునకు వచ్చియున్నదను మాట వినియెను. అప్పుడు మిక్కిలి సంతసించుచు గేయూరకా! మనకార్యసిద్ధి హస్తగతమయినదానిగా భావింపుము. నాబ్రాణమిత్రుఁడు వైశంపాయనుఁడు వచ్చుచున్న వాఁడని పలికెను.

పిమ్మట గేయూరకుఁడు ఆరాజకుమారుని మ్రొక్కుచు దేవ! దేవర వైశంపాయనుఁడు వచ్చువరకుఁ గాలక్షేపము చేయఁదగియే యున్నది. అచ్చటిసంగతి మీకు విశదపరచితినికదా! దేవర తత్సందే తాపము గ్రహించితిరి. కావున నన్ను ముందు బంపుఁడు. నేను బోయి భవదీయ వృత్తాంతమంతయు నాకాంత కెఱింగించి జీవన ధారణోపాయ మాకలించెద. మీవాతా౯శ్రవణమూతగాఁబూని యానెలంతఁ బ్రాణములు థరించు ననుగ్రహింపుఁ డని పలుకగా విని యారాజనందనుండు వెనుకగూర్చునియున్న పత్రలేఖం జూచు మేఘనాధుఁ డెక్కడనని యడిగెను.

అంతలో మేఘనాథుం డెదుర నిలఁబడుటయు నతనిం జూచి యోరీ! నీవు వెనుక పత్రలేఖం దీసికొనివచ్చుట కెందుంటివో యిప్పు డచ్చటకీ పత్రలేఖం దీసికొని కేయూరకునితోఁగూడ ముందుగాఁ బొమ్ము. నేనును వైశంపాయనునితో మాట్లాడి వెనుక వచ్చెద! నని నియమించి కేయూరకా! నీవు కాదంబరీ సణదేశమునాకుఁ దీసికొని