పుట:Kashi-Majili-Kathalu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

కాదంబరి


వలయును. అని చెప్పుమని చెప్పి వెండియు నతండు ప్రియసఖీ! నీవు దారిలో మద్వియోగపీడచేఁ గుందుచు శరీరసంస్కార ముపేక్ష జేయుదువు సుమీ! సమయమున కాహారమును గుడుచుచుఁ దెలియని దారిం బోవక విమర్శించి బస జేయుచుండవలయును. ఏమి జేయుదును? నీకంటెఁ గాదంబరీ ప్రాణములు ప్రియములని నిన్నొంటిగాఁ బంపుచున్నాను. నాప్రాణములు నీ చేతిలో నున్నవి కావున నీయాత్మ జాగరూకతతోఁ గాపాడికొనుమని పలుకుచు నాలింగనము జేసికొని కేయూరకుని కప్పగించి నన్ను వెండియు మహాశ్వేతాశ్రమములో గలిసికొనవలయునని యుపదేశించి వారి నంపెను.

వారు వోయినవెనుక నతండు వీరు వేగముగా నందుఁ బోవుదురా? దారిలో నేదియైన యంతరాయమురాదుగదా! ఎన్నిదినములకుఁబోయి యామె నూరడింతురు? అని యాలోచించుచు శూన్య హృదయుండై క్షణమందు వసించి స్కంధావార మెంత దూరమం దున్నదియో తెలిసికొని రమ్మని వాతా౯హరునిఁ బంపి వైశంపాయను నెదుర్కొనుటకుఁ దన్నుఁ బంపుమని యాచించుటకై తండ్రిగారి యొద్ద కరిగెను.

దూరమందె నమస్కరించుచున్న పుత్రుంజూచి తారాపీడుఁడు నిభ౯రస్నేహగర్భమగు స్వరంబున వత్సా! రమ్ము. రమ్ము. అని చేతులు సాచుచుఁ గౌగలించుకొని దాపునఁ గూర్చుండఁ బెట్టికొని ప్రత్యవయవము పాణిచే స్పృశించుచు దాపుననున్న మంత్రి ముఖ్యునితో నిట్లనియె.

ఆర్యా! శుకనాస! ఆయుష్మంతుఁడగు చంద్రాపీడునిం జూచితివా? ఇతని మేన యౌవనము పొడసూపినది. వివాహయోగ్యమగు దశవహించి యున్నవాఁడు విలాసవతితో నాలోచించి వీనికిఁ దగిన రాజకన్యక నరసి పెండ్లి చేయవలయుననుటయు శుకనాసుఁడు