పుట:Jyothishya shastramu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలచక్రములోని 12 భాగములలో 2:1 ప్రకారము, అనగా ఒక సరి సంఖ్య, ఒక బేసిసంఖ్య భాగములను తీసుకొని ఆ రెండు భాగములు ఏ గ్రహములకు స్వంత స్థానములో చూచుకోవలెను. ఈ సరి బేసి సూత్రము ప్రకారము, కాలచక్రములోని పండ్రెండు భాగములను విభజించి చూచితే, సరి బేసి రెండు భాగముల ప్రకారము మొత్తము ఆరు సరి, బేసి భాగములు వచ్చును. మొదట సరి, బేసి భాగములు రెండు ఒక పక్షములో పెట్టి, రెండవ సరి, బేసి భాగములను మరొక పక్షములో పెట్టి, అన్ని భాగములను చూచితే మొత్తము ఆరు గ్రహములు ఒక పక్షముకాగా, మిగత ఆరు గ్రహములు మరొక పక్షమగుచున్నవి. ఈ రెండు పక్షములను మిత్రు శత్రు పక్షములు అంటున్నాము. 2:1 అను ఆత్మల నిష్పత్తి ప్రకారము కాలచక్రములో పండ్రెండు భాగములను విభజించి చూచితే, గ్రహముల రెండు వర్గములు తెలియును. ఈ విధానమును తర్వాత పేజీలో 15వ పటములో చూడుము.

15వ పటములో ఒక సరి, ఒక బేసి ఇళ్ళను తీసుకొని, విభజించడము జరిగినది. దాని ప్రకారము, కాలచక్రములో ఎక్కడ నుండి మొదలు పెట్టినా సరి బేసి సూత్రము మీదనే విభజించాలి. దాని ప్రకారము మొదటి 12వ మీన భాగమును 1వ మేష భాగమును తీసుకొని అందులోని రెండు గ్రహములను ఒక పక్షములో చేర్చి, తర్వాత 2వ వృషభ భాగమును 3వ మిథున భాగమును తీసుకొని, అందులోని రెండు గ్రహములను రెండవ ప్రతి పక్షములో చేర్చాలి. అలా చేస్తే 12వ మీన, 1వ మేష స్థానముల అధిపతులైన గురు, కుజులు ఒక పక్షముకాగా తర్వాత 2, 3 స్థానాధిపతులైన చిత్ర, మిత్ర గ్రహములు ప్రతి పక్షమైన శత్రుపక్షములో చేరి పోవుచున్నవి. అదే విధముగా 4, 5 స్థానాధిపతులైన చంద్ర, సూర్యులు, గురు కుజులు