పుట:Jyothishya shastramu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. కాలచక్రములో మిత్రు, శత్రు గ్రహములు ఏవి?

జ్యోతిష్యము ఆధ్యాత్మికముతో ముడిపడియున్నదని ముందే చెప్పు కొన్నాము. ఆధ్యాత్మికము ప్రకారము పరమాత్మ మూడు ఆత్మలుగా విభజింప బడినది. ఆ మూడు ఆత్మలనే భగవద్గీతయందు పురుషోత్తమప్రాప్తి యోగమున క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడని చెప్పారు. క్షరుడు అనగా ప్రకృతిలో కలిసిన ఆత్మ కావున అది నాశనమగునదని అర్థము. అక్షరుడు అనగా నాశనము కానివాడని అర్థము. పురుషోత్తముడనగా క్షరునికంటేను అక్షరునికంటేను ఉత్తమమైనవాడని అర్థము. ఈ మూడు ఆత్మలనే అద్వైతము, ద్వైతముకాని త్రైతము అంటున్నాము. ఈ త్రైతమును రెండు భాగములుగా విభజించవచ్చును. కర్మవున్న ఆత్మలు, కర్మలేని ఆత్మలు అని విభజించి చూస్తే, కర్మవున్న ఆత్మ క్షరుడు అనబడు జీవాత్మ అని తెలియుచున్నది. కర్మలేనివి రెండు ఆత్మలు గలవు. అవి అక్షరుడు అనబడు ఆత్మ, పురుషోత్తముడనబడు పరమాత్మ అని తెలియుచున్నది. ఈ రెండు భాగములలో కర్మలేని అక్షర, పురషోత్తమ ఆత్మలు గొప్పవనీ, కర్మతో కూడుకొన్న క్షరాత్మ తక్కువదనీ తెలియుచున్నది. మూడు ఆత్మలలో గొప్పవి, తగ్గువి అని తెలియునట్లు 2:1 గా చెప్పకోవచ్చును. కర్మ విధానమును అనుసరించి వాటినే సరి, బేసి అంటాము. 2:1 అనినా, సరి బేసి అనినా, కర్మలేని పరమాత్మ ఆత్మలు రెండు అనియూ, కర్మయున్న జీవాత్మ ఒకటి అనియూ అర్థము. ప్రతి జీవరాసి శరీరములోను 2:1 ఉన్నదనీ మరియు సరి బేసి కలదనీ చెప్పవచ్చును. దైవమునకు జీవునకు గుర్తుగా 2:1 అని సరి బేసి అనవచ్చును. ఈ సరి బేసి జ్యోతిష్యములోనూ ఉపయోగ పడుచున్నది. అదెలా ఉపయోగపడుచున్నదనగా!