పుట:Jyothishya shastramu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూపులేక వాహన బలములేని వారినీ కుజగ్రహము వ్యతిరేఖముగాయున్న వారినీ తప్పక ప్రమాదమునకు గురి చేయును. కుజ,శుక్రులు ఒకరికొకరు పూర్తి శత్రువులు. కుజగ్రహము ఎరుపురంగుగలది. శుక్ర గ్రహము తెలుపు రంగుగలది. ఎరుపురంగు కల్గిన వాహనము కుజునకు పూర్తి వ్యతిరేఖ మగుట వలన అటువంటి రంగు వాహనములు ప్రమాదమునకు గురి కాగలవు. శుక్రుడు తన వాహనమును కాపాడుకోవాలని ప్రయత్నించినా రోడ్డంతా కుజునిదే కాబట్టి రోడ్డు సరిగాలేకపోవడము వలన కూడా ప్రమాదము జరుగవచ్చును. రోడ్డుకు వాహనములకు అధిపతులైన కుజ శుక్రులను అనుసరించి భూతములు ప్రమాదమును కల్గించును. భూతములు రోడ్డు ప్రక్కన ఒకేచోట వుండుట వలన ఒకే స్థలములోనే ప్రమాదములు ఎక్కువ జరుగుచుండును. బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎప్పుడూ ఒకేచోట ఉండడన్నట్లు కొన్ని భూతములు కూడా స్థలములు మార్చి ప్రమాదములు చేయును. శుక్రుడు అగ్నికి కూడా అధిపతి అయినందున కుజగ్రహము అనుకూలము కల్గినవారు ప్రయాణించు వాహనము తనదేయైనందున శుక్రుడు తన వాహనమును తన అగ్నితో కాల్చివేయును. అప్పుడు ఆ ప్రమాదములో నల్లగమారిపోయి చనిపోవుదురు. కుజుడు ఎరుపురంగుకూ, ఎరుపురంగు కల్గిన రక్తమునకూ అధిపతియైనందున ప్రమాదములో రక్తము బయటికి రాకుండ ఎరుపుతనము ఎక్కడా కనిపించకుండా మనుషుల దేహాలను నల్లగ చేయును. అటువంటి ప్రమాదములను చూచిన వెంటనే ఇది శుక్ర గ్రహము చేసిన ప్రమాదమని చెప్పవచ్చును. అట్లు కాకుండ రక్తసిక్తముగా కనిపించు ప్రమాదములను కుజుడు చేసినవని చెప్పవచ్చును. పెళ్ళి అంటే కుజునకు సరిపోదు. దేవతా భక్తియంటే శుక్రగ్రహమునకు సరిపోదు. శుక్రుడు రాక్షస గురువు కావున దేవతలంటే ద్వేషము. ఇట్లు ప్రమాదములు