పుట:Jyothishya shastramu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందరిని ఆపి తనిఖీ చేసి పంపునట్లు కనిపించని శక్తులు కొన్ని రోడ్డు ప్రక్కనయుండి, దూరమునుండి వచ్చు వాహనములో వ్యక్తులు ఎవరైనదీ, ఎక్కడికి పోవునదీ, ఏ కార్యము మీద పోవునదీ గ్రహించగలుగుదురు. వాహనము దగ్గరకు రాకముందే అన్ని విషయములను గ్రహించగల్గును. వాహనములో వచ్చేవారు పెళ్ళికార్యమునకు పోవువారుగానీ లేక దేవతల వద్దకు పోవువారుగానీ ఉండినట్లయితే, అటువంటివారిని ఎంచుకొని ప్రమాదములను కల్గింతురు. రోడ్డు ప్రక్కనయున్న భూతములు దేవుని జ్ఞానమును కల్గియుందురు. దేవుని జ్ఞానములేనివారు రోడ్డు మీద వస్తునప్పుడే గ్రహించిన భూతములు వారిని ఏమీ చేయక వదలివేయు చుండును. అట్లు భూతములు రోడ్డుమీద కాపలా కాస్తున్నప్పుడు దేవాలయములకు పోవువారుగానీ, ఏ దేవత నిమిత్తము పోవువారుగానీ లేక పెళ్ళికార్యమునకు పోవువారుగానీ ఆ రోడ్డుమీద దూరముగా వస్తున్నప్పుడే అక్కడున్న భూతములు వారిని గ్రహించగలిగి దేవాలయము లకు పోవు దేవతాభక్తుల మీదనూ, పెళ్ళి కార్యముల నిమిత్తము పోవు వారిమీదనూ కోపము కల్గినవై వారు ప్రయాణించు వాహనమును ప్రమాదమునకు గురిచేయుదురు. అట్లని పెళ్ళికి పోవు అన్ని వాహనములకూ ప్రమాదములు జరుగవు. అలాగే దేవతలకు పోవు వారి వాహనములు అన్నీ ప్రమాదమునకు గురికావు. కొన్ని వాహనములు పెళ్ళివారివిగానీ, దేవతలకుపోవువారివిగానీ ప్రమాదమునకు గురికావడము కొన్ని కాకుండ పోవడము జరుగుటకు కారణము గలదు. అదేమనగా! వాహనములకు అధిపతి శుక్రుడు. రహదారులకు అధిపతి కుజగ్రహము. దేవతలకు పోవు వారిమీద, పెళ్ళిళ్ళ విషయముమీద కోపముకల్గిన భూతములు రోడ్డు ప్రక్కనయుండినప్పటికీ, అందరినీ గ్రహించుచున్నప్పటికీ శుక్రగ్రహము యొక్క