పుట:Jyothishya shastramu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జరుగుటకు గ్రహములు కారణముకాగా, వాటిని అమలు చేయు భూతములు కొన్ని భూమిమీద ఉన్నవని చెప్పవచ్చును. ఒక రోడ్డుమీదనే కాకుండా ఎక్కడైనా పెళ్ళి విషయములో కుజుడు, దేవతల విషయములో శుక్రుడు వ్యతిరేఖముగానే యుందురు. అందువలన ఈ రెండు విషయములలో ప్రమాదములు ఎప్పుడైనా ఎక్కడైనా జరుగవచ్చును.

24) శుక్రుడు వాహనములకు అధిపతియైనందున శనివర్గములోని వారందరికీ వాహన యోగముండవచ్చును. గురువర్గములోని వారందరికీ వాహన యోగముండదని వారికి వాహనములుండవని చెప్ప వచ్చునా?

జ॥ అలాగైతే ప్రపంచములో కొన్ని వస్తువులు కొందరికే పరిమితమై ఇతర వర్గమునకు లేకుండపోవచ్చును. వస్తువులు ఎవరి అధీనములోయున్నా వారివారి కర్మనుబట్టి లభించవలెనను సూత్రము ప్రకారము లభించవలసి యున్నవి. అట్లుకాకపోతే అంతా గందరగోళమైపోవును. భూమిమీదున్న మనుషులందరూ గురువర్గమువారుగానూ, శనివర్గమువారుగానూ ఉన్నారు. మీరనుకొన్నట్లయితే గురువు ఆధీనములోనున్న బంగారు శనివర్గీయుల వద్ద లేకుండపోవాలి, అలాగే శనివర్గములోని వాహనములు గురువర్గము వారివద్ద లేకుండపోవాలి. అట్లుకాకుండ వారి కర్మానుసారము అన్నీ అందరికీ లభించునట్లు దేవుడు చేశాడు. ఒక వర్గములోని వస్తువు మరొక వర్గములోని వారికి ఎట్లు లభించుచున్నదీ ఒక ఉదాహరణ ద్వారా తెలుసు కొందాము. రాజీవ్‌గాంధీ జాతకమును చూచినప్పుడు ఆయనకు శత్రు గ్రహములు గురువర్గము వారనీ, శనివర్గము వారు మిత్రుగ్రహములనీ తెలిసినది. రాజీవ్‌ చనిపోయిన రోజు ఆయుష్షుకు అధిపతి శనియైనందున శనికి శత్రువులైన గురు, కుజులు మరియు సూర్యుడు ముగ్గురూ కలిసి