పుట:Jyothishya shastramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లెక్కించి చూచితే 12×9=108 మొత్తము నూటఎనిమిది గుణములుగా ఉన్నవి. ఒక తామస భాగములోనున్నవి 108 గుణములు కాగా, రాజస భాగములోనూ 108 గుణములు కలవు. అట్లే సాత్త్విక భాగములోనూ గుణముల సంఖ్య 108 గానే కలదు. మూడు భాగములలోనూ మొత్తము గుణముల సంఖ్య 108×3=324 గా ఉన్నది. గుణముల గుంపు చిత్రమును ఈ క్రిందగల 8వ పటములో చూడుము.

గుణచక్రము - 8వ పటము

తామస భాగములో గుణముల సంఖ్య 108 కదా! వాటివలన ఉత్పన్నమయ్యే కర్మకూడ 108 రకములుగా ఉండును. అందులో 54 గుణముల వలన వచ్చునది పాపము కాగా, మిగత 54 గుణముల వలన వచ్చునది పుణ్యమై ఉన్నది. ఈ విధముగా ఒక తామస భాగములోనే కర్మ 108 రకములుగా తయారుకాగా, మొత్తము మూడు భాగములలో 324 రకముల పాపపుణ్యములు తయారగుచున్నవని చెప్పవచ్చును. ఇపుడు,