పుట:Jyothishya shastramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మ ఎన్ని రకములు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక గుణ భాగములో అయితే 108 రకములనీ, మూడు గుణ భాగములలో మొత్తము 324 రకములు అని సులభముగా చెప్పవచ్చును. కర్మ విధానమూ, కర్మయొక్క విభాగముల విధానమూ, భూమిమీద ఒక ఇందూమతములోనే కలదు. మిగతా మతములలో కర్మ విధానముగానీ, దాని విభజనగానీ ఎక్కడా కనిపించదు. ఇది బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారమున్నది. కానీ ఇప్పటి కాలమున జ్యోతిష్య శాస్త్రములో కూడ కర్మ విధానమును ఎవరూ వ్రాసుకోవడము జరుగలేదు.

9. కర్మను అనుభవించు వాడు ఎవడు?

ఇంతవరకు కాలచక్రమునూ, కర్మచక్రమునూ, గుణచక్రమునూ గురించి వరుసగా తెలుసుకొన్నాము. ఇపుడు కర్మను అనుభవించు జీవున్ని గురించి తెలుసుకొందాము. కర్మను పరిపాలించుటకు కాలచక్రములోని గ్రహములున్నాయి. కర్మను పుట్టించుటకు గుణచక్రములోని గుణములు ఉన్నాయి. కర్మను అనుభవించుటకు జీవుడు గుణచక్రములోనే ఉన్నాడు. జీవుడు కర్మను అనుభవిస్తూ, కాలమును గడపడమునే ‘జీవితము’ అంటాము. ‘‘నహి కశ్చిత్‌ క్షణమపి’’ అని భగవద్గీతలో అన్నట్లు, ఒక్క క్షణము కూడ వృథా కాకుండ, జీవుడు జీవితములో కర్మను అనుభవిస్తున్నా డని తెలియుచున్నది. జీవుడు అనుభవించబోవు కర్మను తెలుసుకోవడమే ‘‘జ్యోతిష్యము’’ అంటున్నాము. జ్యోతిష్యమును సమగ్రముగ తెలుసుకో వాలంటే, కర్మను అనుభవించే జీవున్ని గురించి పూర్తిగా తెలుసుకోవలసి యుండును. కర్మను అనుభవించు జీవుడు, తలలోని కర్మచక్రము క్రిందనున్న గుణచక్రములోనే ఉండును. గుణచక్రము యొక్క మూడు భాగములలో ఏదో ఒక భాగములో జీవుడుండి, ఆ గుణముల ప్రవర్తనల వలన కలుగు