పుట:Jyothishya shastramu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక భాగములోని గుణములకు, మరొక భాగములోని గుణములకు పేర్లు ఒకే విధముగా ఉండినా, అవి ఒకే విధముగా లేవనీ, వాటి వలన వచ్చు కర్మకూడా ఒకే విధముగా లేదనీ తెలుసుకొన్నాము కదా! ఇపుడు ముఖ్యముగా తెలుసుకోవలసినది ఏమనగా! ఒక భాగములోని ఒకే పేరున్న గుణము, తాను ఒకటే కాక, తన జాతి గుణముల సముదాయముగా ఉన్నది. ఉదాహరణకు తామస గుణభాగములోని క్రోధము ఒక్కటేగాక, అది తొమ్మిది క్రోధముల గుంపుగా ఉన్నది. ఒక భాగములోని తొమ్మిది సంఖ్యలోనున్న ఒకేపేరుగల గుణములు సమానముగా లేకుండ, పరిమాణములో తేడా కల్గియున్నవి. ఎట్లనగా! ఒక పేరున్న క్రోధము లేక కోపము యొక్క గుణముల గుంపులో మొదటిది పెద్దగా ఉండగా, దాని తర్వాత రెండవది మొదటి దానికంటే పరిమాణములో కొంత చిన్నదిగా ఉండును. తర్వాత రెండవ దానికంటే మూడవది పరిమాణములో కొంత తక్కువగా ఉండును. ఆ విధముగా ఒకదానికొకటి చిన్నదిగా ఉంటూ, చివరి తొమ్మిదవది అన్నిటికంటే చిన్నదిగా ఉండును. తామసభాగములో కోపము తొమ్మిది రకములుగా ఉన్నట్లు, మిగత రెండు భాగములలో కూడా కోపము తొమ్మిది భాగములుగా ఉన్నది. దీనినే చిన్న కోపము, పెద్ద కోపము, కొంత కోపము అంటున్నాము. ఒక భాగములో ఒక గుణము తొమ్మిది గుంపుగా ఉండుట వలన, చెడు గుణములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అను ఆరు గుణముల గుంపు మొత్తము యాభై నాలుగుగా ఉన్నవి. 6×9=54 ఒక చెడు గుణముల గుంపు ఉండగా, మరొక మంచి గుణములు కూడ 6×9=54 గుంపుగా ఉన్నవి. ఈ విధముగా లెక్కించి చూచితే ఒక గుణ భాగములో పెద్ద గుణములు మొత్తము పండ్రెండు కాగా, వాటి గుంపులోని చిన్న గుణములను కూడ