పుట:Jyothishya shastramu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జరిగితే ఏవో శక్తులు చేశారని అంటారు. అదే అమెరికాలో అయితే ఏకంగా గ్రహాంతరవాసులని ఏలియన్స్‌ అని పేరుపెట్టి చెప్పుచుందురు. ఎవరు ఏమి చెప్పినా ఒక పని జరిగింది అంటే అది పన్నెండు గ్రహముల ద్వారానే జరగాలి. పైనున్న గ్రహములు నడిపితే కనిపించేవారు, కనిపించనివారు అందరూ నడుస్తున్నారు. అంతేతప్ప స్థల ప్రభావములంటూ ఎక్కడా ఉండవు. స్థల ప్రభావము అంటే అది మూఢనమ్మకమౌతుంది.

రోడ్డు ప్రమాదములకు కారణము కనిపించని కర్మకాగ అమలు జరుగునది ఎన్నో రకములుండును. ఒకే స్థలములో ఎక్కువ ప్రమాదములు జరుగడము అక్కడ ప్రమాదములు జరుగుటకు అవకాశము లేకున్నా, రోడ్డు అన్ని విధముల బాగున్నా, ఊహించని రీతిలో ప్రమాదములు జరగడమును చూస్తే మనకు తెలియనిదేదో అక్కడ జరుగుచున్నదని అర్థము కాగలదు. ప్రారబ్ధము ప్రకారము కొన్ని కర్మలను అనుభవింపజేసినా వాటిని చూసి ఇతరులు కొంత జ్ఞానులుగా మారగలరనీ, జ్ఞానము మీద ఆసక్తి పెరుగునని తలచి ప్రమాదములను కలుగజేయుచుందురు. భూమిమీద దైవజ్ఞానము కల్గినవారు కనిపించని సూక్ష్మరూపమున ఎందరోయున్నారు. వారు జ్ఞానము మీద శ్రద్ధగలవారైయుండి, జ్ఞానమును తెలిసినవారైయుండి అజ్ఞానులను చూచి వారిని జ్ఞానులుగా మార్చేదానికి ప్రయత్నము చేయుచుందురు. ఎంత ప్రయత్నము చేసినా జ్ఞానమును తెలియక అజ్ఞానమార్గమున పోవు వారిమీద కోపముకల్గి ప్రమాదములను కలుగజేతురు. ఎక్కువ ఒకే స్థలములో ప్రమాదములు జరుగుటకు కారణము ఆ స్థలములో కనిపించని శక్తి ఒకటి రోడ్డుమీద కాపలాకాస్తూ వచ్చిపోయే వాహనములను గమనిస్తూ యుండును. బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు తమకు అనుకూలమైనచోట రోడ్డు ప్రక్కన ఉంటూ వస్తూ పోయే వాహనములను గమనిస్తూ అనుమానముగల