పుట:Jyothishya shastramu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొమ్ములు తిరిగినవారికి కూడా తెలియని రహస్యములను చెప్పడము జరిగినది. ఇటు జ్యోతిష్యులకు అటు జ్ఞానులకు ఇరువురకు ఉపయోగ పడునట్లు జ్యోతిష్యములోని దశాచారమును గురించి చెప్పడము జరిగినది. దశాచారము అంటే ఏమిటో తెలియగల్గితే వాడు జ్యోతిష్యుడైనా పూర్తి జ్ఞానికాగలడు.

23) బస్సు ప్రమాదమును గురించి చెప్పుతూవుంటే అంతా మాకు క్రొత్తగాయున్నది. మాకు పూర్తి ఏమీ తెలియకపోయినా మీరు చెప్పేమాట నిజమే అయివుండవచ్చునని కొద్దికొద్దిగా అర్థమగుచున్నది. కొన్ని రోడ్డు ప్రమాదములను నేను నా స్నేహితులు చూచాము. రోడ్డు బాగున్నా ఏ ఆటంకములు ఇబ్బందులు లేకున్నా ఒకే స్థలములో ఎక్కువ ప్రమాదములు జరుగుచుండును. అది స్థల ప్రభావమంటారా? గ్రహ ప్రభావమంటారా?

జ॥ ఎక్కడ ఏమి జరిగినా అది అంతయు ద్వాదశ గ్రహముల ద్వారానే జరిగితీరాలి. గ్రహములు కర్మను పంచువారు మాత్రమే, కార్యములను గ్రహములు చేయరు. కార్యములను చేయువారు కనిపించెడివారు కొందరు కనిపించనివారు కూడా కొందరు కలరు. రోడ్డు ప్రమాదములు జరుగుటలో కనిపించనివారి పాత్ర ఎక్కువ కలదు. రోడ్డు ప్రమాదములలోనేకాక మరెన్నో కార్యములను కనిపించనివారు చేయుచున్నారు. అమెరికా మరికొన్ని దేశములలో అటువంటి పనులను చేయువారందరినీ గ్రహాంతరవాసులని పేరుపెట్టి వారు వారి వాహనములైన ప్లయింగ్‌సాసర్స్‌ అను వాటి ద్వారా (U.F.O ల ద్వారా) భూమిమీదికి వచ్చి కొన్ని కార్యములను చేసిపోయారని అవి ఇంతవరకు అర్థముకాని మిస్టరీలూగ మిగిలిపోయాయని చెప్పు చుందురు. మనదేశము (భారతదేశము)లో ఎవరికీ అర్థముకాని పనులు