పుట:Jyothishya shastramu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనముందర ఉన్నప్పుడు దానిని గుర్తించక అనవసరముగా దైవదూషణ, జ్ఞానదూషణ చేసినవారికి శిక్షలు పడుట ఖాయమని నిరూపించుటకు బస్సు ప్రమాదము జరిగిందని మేము నమ్ముచున్నాము. ఇప్పుడు ప్రమాదములో పోయిన వారందరూ గతములో, గత జన్మలో ఎటువంటివారో తెలియదు కదా! మీకు తెలియకున్నా మాకు తెలిసిన సత్యముతో నేడు కూడా దేవుని జ్ఞానమును దూషించినవారు అనవసరముగా దైవాగ్రహమునకు గురియైనా రని తెలియుచున్నది. అటువంటి వారందరికీ ఇటువంటి శిక్షయే పడునని దేవుడే తెల్పునట్లు హైవేలో కాలిపోయిన హైదరాబాద్‌ బస్సు నంబర్‌ ‘‘963’’ ఇది మేము దేవుని గుర్తని చెప్పిన నంబరేనని గుర్తుంచుకోండి. బస్సు బెంగుళూరివారిదైనా మొదట మా ఆశ్రమముగల తాడిపత్రిలోనిదేనని తెలియండి. మేము దేవుని గుర్తు 9 6 3 అని వ్రాసిన తర్వాత అదే నంబరుతో మేమున్న ఇదే ప్రాంతములో వచ్చినది. ఈ ప్రాంతమునుండి వచ్చిన బస్సు, మేము ప్రకటించిన 9 6 3 నంబరేగల బస్సులో ప్రమాదము జరిగిందంటే ఇక్కడి జ్ఞానము అగ్నిలాంటిదని దైవదూషణ చేసిన మిమ్ములను కూడా వదలక మరుజన్మలోనైనా ఇలాగే కాల్చగలనని చెప్పినట్లున్నది. అందువలన ఇప్పటినుండియైనా ఇది అసలైన హిందువుల జ్ఞానమనీ, ఇది అగ్నిలాంటి జ్ఞానమని తెలిసి జాగ్రత్తపడండి. ఇప్పటినుంచైనా ఎవరూ దైవాగ్రహమునకు గురికాకుండ ఉండమని తెల్పుచున్నాము. ఇప్పుడు వ్రాయబడిన గ్రంథము జ్యోతిష్యగ్రంథము. జ్యోతిష్యము ఒక్క హిందువులకు తప్ప వేరెవరికీ తెలియదు. కొందరు హిందువులకు జ్యోతిష్యము తెలిసినా, జ్యోతిష్యశాస్త్రము పూర్తి సక్రమముగా తెలియదు. ఇప్పుడు ఇందువులలోనే (హిందువులలోనే) ఎవరికీ తెలియని రహస్యముగాయున్న జ్యోతిష్య సూత్రములను ఈ గ్రంథములో వ్రాయడము జరిగినది. జ్యోతిష్యములో