పుట:Jyothishya shastramu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుని ముందరే ఆయన గీతను కాల్చినవారినీ, ఆయన జ్ఞానమును దూషించిన వారినీ వదలకుండా రాబోవు కాలములలో ఎప్పుడో ఒకమారు తప్పుకు తగిన శిక్షవేయకమానడు. మాచేత వ్రాయబడిన గ్రంథములు కొన్ని శక్తివంతమై ప్రత్యక్షముగా కనిపిస్తున్నవి. గ్రంథమును చదివితే ఎంతో జ్ఞానశక్తి కల్గుచున్నది. దగ్గరుంచుకొంటే కొన్ని రోగములు సహితము దూరమగుచున్నవి. 48 పేజీలుగల ‘‘మంత్రము-మహిమ’’ అను చిన్న గ్రంథమే దగ్గరుంచితే తేలునొప్పిని నిమిషములో లాగివేయుచున్నది. ఇంత ప్రత్యక్షముగా ఒక గ్రంథమేయుంటే దానికంటే పెద్దగయున్న కొన్ని గ్రంథములలో ఎంతో దైవశక్తియున్నది. భగవద్గీత అన్నిటికంటే మించిన శక్తికలది. అటువంటి వాటిని దూషించితే దాని ఫలితమెట్లుంటుందో తెలివైనవారు ఊహించుకోవచ్చును. ‘‘సృష్ఠికర్త కోడ్‌ 666’’ యని క్రైస్తవులు వ్రాస్తే వారికి వ్యతిరేఖముగా అది మాయ కోడ్‌యని దేవునికోడ్‌ ఇదియని 9 6 3 ను మేము వ్రాస్తే అది ఏమిటి 64 పేజీలుగల ఆ గ్రంథములో ఏముంది అని చూడక గ్రుడ్డిగా జ్ఞానమును దూషించినవారికి వారికి పడిన శిక్షే పడుతుందని హైదరాబాద్‌ వస్తున్న బస్సు ప్రమాదము సాక్షిగా నిలచినది. మీరెలా చెప్పగలరని మీ మాట వాస్తవమని మేము నమ్ముటకు ఆధారమేమి యని ఎవరైనా అడిగితే వారికి మేము చెప్పునదేమనగా! దేవునికి అందరూ సమానమే ప్రపంచ సంబంధ కర్మలు ఎలాయున్నా అవి కేవలము కష్ట సుఖములతోనే తీరిపోతాయి. అయితే దేవుని సంబంధమైనవి ఘోరముగా ఉంటాయి. అవి ఒక జన్మకే పరిమితికావు. రెండు యుగముల పర్యంతము జన్మజన్మలకు బాధించును.

ప్రస్తుత జన్మలో అందరి ఎదుట అన్ని మతములకు మించిన జ్ఞానము ఇందూ (హిందూ) మతములోనే కలదు. అంతపెద్ద జ్ఞానము