పుట:Jyothishya shastramu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేరువేరు వర్గమునకు చెందినవి. ఒక గ్రహము పాపవర్గము లేక శత్రువర్గము నకు చెందినదైతే మరియొక గ్రహము పుణ్యవర్గము లేక మిత్రవర్గమునకు చెందినదైయున్నది. మనిషి జాతకమునుబట్టి, అందులో జన్మలగ్నమునుబట్టి గ్రహములు రెండు వర్గములుగా విభజింపబడుచున్నవి. ఆ విధముగానున్న గ్రహములలో శనివర్గము వారు పుణ్యమును పాలించువారైయున్నారను కొనుము. అప్పుడు గురువర్గములోని గ్రహము లన్నియు పాపమును పాలించునవైయుండును. పుణ్యమును పాలించు గ్రహములను శుభగ్రహము లనీ మిత్రగ్రహములనీ, అనుకూలమైన గ్రహములనీ అంటుంటాము. అదే పాపమును పాలించు గ్రహములను అశుభగ్రహములనీ, శత్రుగ్రహములనీ, వ్యతిరేఖమైన గ్రహములనీ అంటుంటాము.

శనివర్గమునకు చెందిన జాతకునికి జన్మకుండలిలో కళత్రస్థానమైన ఏడవ స్థానమున శత్రువర్గమునకు సంబంధించిన అశుభగ్రహమైన కుజ గ్రహము ఉన్నాడు. అందువలన కుజగ్రహము యౌవ్వనముకు అధిపతియై నందున జాతకుని యౌవ్వనమును అడవిగాచిన వెన్నెలవలె చేసి, యౌవ్వనములో కళత్ర సుఖము లేకుండా చేయును. అందువలన అటువంటివానికి జీవితములో పెళ్ళియగుటకు ఆలస్యమగును. ఏదో ఒక కారణముచేత పెళ్ళి కుదరకుండా పోవుచు చివరకు వయస్సు ముదిరి పోవును. వయస్సు ముదిరిన తర్వాత పెళ్ళి కావచ్చును. కొందరికి శనివర్గము శత్రువర్గమైనప్పుడు కళత్రస్థానమున శుక్రుడున్నా లేక శుక్ర హస్తమున్నా కళత్రమునకు అధిపతియైన శుక్రుడు జాతకునికి అశుభమును కల్గించుచూ వానికి యౌవ్వనములో పెళ్ళి అయినా శుక్రగ్రహము వలన యౌవ్వనములో భార్య అనుకూలవతిగా లేకుండును. యౌవ్వనమంతా ఆ జాతకునికి భార్య అనుకూలములేక స్త్రీ సౌఖ్యము లేకుండాపోవును. కుజ