పుట:Jyothishya shastramu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేతువుగానీ ఉండినట్లయితే ఆ జాతకునికి రెండవ పెళ్ళి జరుగుటకు అవకాశమున్నది. కళత్రము అనగా పురుషునికి స్త్రీ కళత్రమగుననీ, స్త్రీకి పురుషుడు కళత్రమగునని మరొక అర్థము కలదు. అందువలన ఒకవేళ పెళ్ళికాకున్నా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో అక్రమ సంబంధము ఏర్పడునట్లు రాహు కేతు గ్రహములే చేయును. కొందరి కుటుంబములో భర్త చనిపోయిన భార్యవుండినా అమె ముండమోసిన విధవగా మిగిలి పోవుచున్నది. అటువంటి ఒక స్త్రీకి ఎటువంటి ఇతర పురుషునితో సంబంధముండదు. అలా ఉండుటకు కారణము ఏమనగా! కళత్ర స్థానములో రాహువుగానీ, కేతువుగానీ ఉండినప్పుడు అక్కడే ఆ గ్రహములకు వ్యతిరేఖమైన రెండు లేక మూడు గ్రహములున్నట్లయితే అక్కడ రాహువు కేతువుల ప్రభావము అణిగిపోవును. వారు చేయు రెండవ పెళ్ళికిగానీ, రెండవ అక్రమ సంబంధముగానీ జరుగకుండపోవును. కళత్ర స్థానములో రాహువు కేంద్రమున్న చోట ఆ గ్రహముకు వ్యతిరేఖమైన గ్రహములు కాకుండ అనుకూలమైన గ్రహములుంటే అటువంటి జాతకునికి ఒక పెళ్ళికి బదులు రెండు లేక మూడు పెళ్ళిళ్ళు జరుగునట్లు చేయగలరు. అట్లే ఒక అక్రమ సంబంధమునకు బదులు మరికొన్ని అక్రమ సంబంధములు కల్గింతురు. ఇదంతయు జాతక చక్రములోని గ్రహములు ఆడిరచు ఆటలేగానీ మనిషి స్వయముగా ఎక్కడా ఆడడము లేదు.

7) ఒక వ్యక్తికి పెళ్ళి ఆలస్యముగా వయస్సు ముదిరిన తర్వాత అగుటకు కారణమేమి? అట్లే మరికొందరికి పూర్తి చిన్నవయస్సులోనే పెళ్ళి జరుగుటకు కారణమేమి ఉండవచ్చును?

జ॥ మనిషి జీవితములో యౌవ్వనమునకు అధిపతి కుజగ్రహము. అలాగే కళత్రమునకు అధిపతి శుక్రగ్రహము. ఈ రెండు గ్రహములు