పుట:Jyothishya shastramu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహముగానీ, శుక్రగ్రహముగానీ శత్రువులుగా ఎవరున్నా వాని యౌవ్వన వయస్సంతయు సుఖము లేకుండా పోవును. కుజ మిత్రవర్గమువాడై శుభగ్రహమై ఏడవ స్థానములోయున్న చిన్నవయస్సులోనే పెళ్ళియగును. శుక్రుడు అశుభ గ్రహమైనా కళత్రమునకు సంబంధము లేకుండా వేరు స్థానములలో ఉండినా అతని కళత్రములో ఆటంకములు లేకుండా సాగి పోవును.

8) కొన్ని కుటుంబములలో భార్య భర్త ఇరువురూ ప్రతి చిన్న విషయము నకూ పోట్లాడుకొనుచూ, ఒకరిమాటను మరియొకరు వినకుండ కాపురము చేయుచుందురు. వారు అలా ఉండుటకు కారణమేమి?

జ॥ యౌవ్వన కారకుడు కుజుడు, కళత్ర కారకుడు శుక్రుడు అయినందున, వీరు ఇరువురూ శత్రువులగుట వలన చాలామంది జీవితములలో యౌవ్వనములో కళత్ర సుఖముండదు. అంతేకాక పూర్తి శత్రువులుగానున్న వీరు ఇద్దరూ ఒకే లగ్నములో కలిసియున్నప్పుడు జన్మించిన వారికి వారి జీవితాంతము భార్యాభర్తల అన్యోన్యత లేకుండా కాపురము చేయుదురు. కుజగ్రహము ఎవరికి అనుకూలముగాయుంటే వారికి కోపము ఎక్కువయుండును. అందువలన ప్రతి విషయములోనూ కోపగించుకొనుచుందురు. అట్లే కుజ గ్రహము అనుకూలముగాయున్న మగవారికి శుక్రగ్రహము ఇతర స్త్రీల సాంగత్యమేర్పరచును. కుజుడు శుక్రుడూ ఇద్దరూ శత్రువులగుట వలన మనుషుల జీవితములో భార్యాభర్తలు ఏమాత్రము పొందిక లేకుండ జీవితము సాగునట్లు చేయును.

9) కొందరు మనుషులు చూచేదానికి అందముగా లేకున్నా బుద్ధి మాత్రము గొప్పగాయుండి వారి ప్రవర్తన గొప్పదిగాయుండును. వారి