పుట:Jyothishya shastramu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెడు కార్యములన్నిటినీ తన జ్ఞానము చేతనే తొలగించుకొనుటకు ప్రయత్నించును. అదే విధానమును ఇతరులకు కూడా బోధించును. జ్యోతిష్యము ఒక జాతకముతోనే ముగియదు. జ్యోతిష్యము వర్తమాన కాల పంచాంగముల మీద ఆధారపడియుండును. అట్లే జ్ఞానము భక్తి భావముతోనే పూర్తికాదు. తెలిసిన జ్ఞానమును జ్ఞానాగ్నిగా మార్చు బ్రహ్మవిద్యాశాస్త్రము మీద ఆధారపడియున్నది.

48. జ్యోతిష్యములో ప్రశ్నలు

1) జాతకములో ఏ సమస్యనైనా తెలియవచ్చునా?

జ॥ జాతకము అనునది జాఫతకము అని ముందే చెప్పాము. ఫతకము అనగా ముందే నిర్ణయించుకొన్నదని అర్థము. జీవిత ఫతకము పుట్టిన సమయములోనే నిర్ణయించడము జరిగినది. అందువలన పుట్టుటను ‘‘జా’’ అన్నారు. అప్పుడు నిర్ణయము చేయబడిన ఫతకమును జాఫతకము అంటున్నాము. జీవితములోని అన్ని సమస్యలు జాఫతకములో ప్రారబ్ధకర్మ ద్వారా నిక్షిప్తము చేయబడియుండును. జాఫతకమును మనము పుట్టిన సమయమును బట్టి వ్రాసుకొన్నా జరిగెడు భవిష్యత్తు ఏమీ అర్థముకాక అంధకారముతో నిండియుండును. అందువలన భవిష్యత్తు అంధకారముతో కూడుకొనియున్నది. ఆ చీకటిలో ఏమీ కనిపించదు. అందువలన ముందు దినముగానీ, ముందు నిమిషముగానీ ఏమి జరుగునదీ తెలియదు. చీకటిమయమైన జాతకమును జ్యోతితో తెలియవచ్చును. జ్ఞానమను జ్యోతిని ఉపయోగించి చూచితే జీవితములోని ఏ సమస్యనైనా తెలియ వచ్చును. జ్ఞానజ్యోతికలవాడు జ్యోతిష్యుడు. అజ్ఞానముగలవాడు సమస్యను