పుట:Jyothishya shastramu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురించి అడుగువాడు. జ్ఞానము తెలియనివాడు ప్రపంచ ప్రశ్నలనే అడుగును. ప్రపంచ ప్రశ్నలకు జవాబునిచ్చు జ్యోతిష్యుడు, తన పరిచయము చేత జ్ఞానము తెలియని వానికి కూడా జ్ఞానము మీద ఆసక్తి కల్గునట్లు ప్రశ్నకు జవాబివ్వవలెను.

2) జ్యోతిష్యమునకు భవిష్యత్తుకు తేడా ఏమి గలదు?

జ॥ చూచునది దృష్ఠి, చూడబడునది దృశ్యము. అలాగే తెలియబరచు నది జ్యోతిష్యము, తెలియబడునది భవిష్యత్తు. అట్లే జ్ఞానముతో కూడుకొన్నది జ్యోతిష్యము, భయముతో కూడుకొన్నది భవిష్యత్తు. జ్ఞానముతో కూడుకొన్న వాడు జ్యోతిష్యమును చెప్పును. అజ్ఞానముతో కూడుకొన్నవాడు భవిష్యత్తును అడుగును. భావితరము అంటే రాబోవు తరము అని అర్థము. జ్యోతితరము అంటే వెలుగునిచ్చుతరము. ఇప్పుడు జ్యోతిని (జ్ఞానమును) వెలగించితే అది రాబోవు వారికి (తెలియ గోరు వారికి) వెలుగై ఉండును.

3) జ్యోతిష్యము ఎన్ని రకములు కలదు?

జ॥ దేశములో ఎన్ని జ్ఞానములున్నా దేవుని జ్ఞానము ఒక్కటే గలదు. దేవుడూ ఒక్కడేగలడు. అదే విధముగా జ్యోతిష్యము అను పేరును ఎన్నో పద్ధతులుగా చెప్పే విధానములకు పెట్టుకొన్నా అవన్నియు జ్యోతిష్యములు కావు. వాటి వలన భవిష్యత్తు తెలియదు. ద్వాదశ గ్రహముల ద్వారానే కర్మ పాలింపబడుచున్న విధానమునే జ్యోతిష్యము అంటాము.

4) ముహూర్తమంటే ఏమిటి?

జ॥ ముందే నిర్ణయింపబడినది ముహూర్తము. మధ్యలో మనుషులు నిర్ణయించునది ముహూర్తము కాదు. అన్ని ముహూర్తములు జన్మలోనే