పుట:Jyothishya shastramu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జరుగవలసిన ప్రమాదమును తప్పించుకొనుటకు ఒకే ఒక మార్గము కలదని ముందే చెప్పుకొన్నాము. అది ప్రపంచ కార్యము కాదు. పరమాత్మ జ్ఞానమని కూడా చెప్పుకొన్నాము. కర్మను జయించి ప్రమాదమును తప్పించు జ్ఞానమును తెలియవలెనంటే మొదట ఆ మనిషిలో నేను ఫలానా మతము వాడినను భావము పోవాలి. అతని దృష్ఠిలో దేవుడు తప్ప మతము అను భావములేనిది నిజమైన జ్ఞానమగును. అటువంటి స్వచ్చమైన జ్ఞానమును తెలిసినవాడే కర్మను జయించి ప్రమాదమును తప్పించుకోగలడు. సృష్ఠికంతటికీ అధిపతియైన దేవున్ని తెలిసినవాడు, మతాల భ్రమను వీడినవాడు, శరీరాంతర్గత జ్ఞానమును తెలిసినవాడు, ఎంతటి కర్మగలవాడైనా, వానికి ఎంతపెద్ద ప్రమాదము ఉండినా దానిని సులభముగా జయించుకో గలడు. అటువంటి జ్ఞానిగా మారిన వానిని చూచిన గ్రహములు సంతోషించి తమ దశలలో అతనికి సంబంధించిన ఎన్నో కర్మలను దహించివేయుచున్నారు. కర్మను మనిషికి అందించి అనుభవింపజేయు గ్రహములు జ్ఞాని అయినవానిని గౌరవభావముతో చూస్తూ అతని కర్మను హరించివేయుచున్నవి. జ్యోతిష్యములో దశల విభాగము ఇలాయున్నదని తెలియనివానిని జ్యోతిష్యము మీద నమ్మకము లేనివానిని ఎవరూ కాపాడలేరు.

జ్యోతిష్యము మీద నమ్మకమున్నవారు గ్రహచారము మనిషిది, దశా చారము దేవునిదని తెలిసినవాడు నిజమైన జ్యోతిష్యుడగును. నిజమైన జ్యోతిష్యుడు పంచాంగములో చెడు మంచి కర్మలను తెలియగలిగి, అవి జాతకములోని పుట్టిన సమయముతో వచ్చినవని తెలిసి, జనన సమయము లో వచ్చిన వాటిని వర్తమాన పంచాంగములో ఎప్పుడు జరుగునదీ తెలియగల్గును. జనన సమయములో కర్మప్రకారము కల్గిన ప్రమాదములు