పుట:Jyothishya shastramu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడున్న ఫలితమును అందివ్వాలని చూచుచుండును. మంచి గ్రహములు మంచిస్థానములలోనికి పోయినప్పుడు అక్కడున్న మంచి ఫలితములను అందివ్వాలని చూచుచుందురు. మంచి గ్రహములు చెడు స్థానములలోనికి పోయినప్పుడు అక్కడున్న చెడు ఫలితములను ఏమాత్రము జాతకునికి ఇవ్వరు. అలాగే చెడు గ్రహములు చెడు స్థానములలోనికి పోయినప్పుడు అక్కడున్న చెడు ఫలితములను ఇచ్చి కష్టపెట్టుటకు ప్రయత్నించుచుండును. ఒకవేళ చెడు గ్రహములు మంచి స్థానములలోనికి పోయినప్పుడు అక్కడున్న మంచిని ముట్టుకోరు ఎటుతిరిగి జాతకుని కష్టపెట్టుటే వారిపని, కనుక మంచి స్థానములో నున్నప్పుడు కూడా వారు మంచి చేయరు. జాతకుని జన్మ కర్మమునుబట్టి గ్రహములు మంచి గ్రహములుగా, చెడు గ్రహములుగా విభజింపబడి యున్నారు. కావున వారి కర్తవ్యము ప్రకారము వారి పనులను తూచ తప్పక చేయుచున్నారు. ఎంతో బాధ్యతాయుతముగా పనిని చేయుచున్న గ్రహములు, ఎటువంటి కర్మనైనా తమ ద్వారానే వచ్చునట్లు తమ ద్వారానే అనుభవించునట్లు చేయుచున్నారు.

కర్మ విషయములో మొత్తము బాధ్యతంతా పన్నెండు గ్రహముల మీదనే ఉండునట్లు ప్రకృతి నియమించినది. ప్రకృతిని ఆదేశించినవాడు దేవుడుకాగా, ఎక్కడా దేవుని పాత్రలేకుండా, దేవుడు ఏ పనినీ చేయకుండా ప్రపంచము మొత్తమును ప్రకృతి శాసించి నడుపుచున్నది. సృష్ఠి ఆదిలోనే ఆదేశింపబడిన ప్రకృతి, తాను అన్నిటికీ ఆదేశమిచ్చి నడిపించుచున్నది. ఇవన్నియు ప్రతి నిత్యమూ ఒకరికొకరు చెప్పుకొను విషయములు కావు. సృష్ఠ్యాదిలో చెప్పబడినట్లే క్రమము తప్పకుండా అన్నీ ఆచరించుచున్నవి. కర్మ విధానమంతా పన్నెండు గ్రహముల ద్వారానే జరగాలి. కర్మను మనిషి కపాలములో చేర్చుటకుగానీ, ఆ కర్మ ప్రారబ్ధముగా బయటకు వచ్చినప్పుడు