పుట:Jyothishya shastramu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానిని అనుభవింపజేయుటకుగానీ, కర్మవిషయములో అన్ని పనులనూ పన్నెండు గ్రహములు చేయవలసిందేనని తెలియుచున్నది. కర్మవిధానము ప్రకారము కర్మను అనుభవింపచేయు గ్రహచారముగాయున్నవి. ద్వాదశ గ్రహములే. జ్ఞానము వలన దహింపబడు కర్మను తొలగించునవిగాగానీ, జ్ఞానదూషణవలన పుట్టుకొచ్చు క్రొత్తకర్మను అనుభవించునట్లు చేయుటకు గానీ దశాచారరూపములో కూడా పన్నెండు గ్రహములే కలవు. ప్రపంచ విధి విధానము ప్రకారము జనన సమయమునుబట్టి ఆ జన్మలో కష్ట సుఖములను అందించు మొత్తము విధానమును గ్రహచారము అని అంటున్నారు. అలాగే దైవ విధానమునుబట్టి ప్రస్తుత జన్మలోనున్న కష్టములను (కర్మలను) లేకుండా చేయడముగానీ, లేని కర్మలను తగిలించ డముగానీ, చేయు మొత్తము కార్య విధానమును దశాచారము అని అంటున్నారు. ప్రపంచ జ్ఞానము ప్రకారము ప్రారబ్ధకర్మలలోగల చిన్న కర్మను తీసివేయుటగానీ లేని దానిని తగిలించుట గానీ ఏమాత్రము చేయని ద్వాదశ గ్రహములు దైవవిధానములో అదే జన్మలో తీసివేయడము, తగిలించడము కూడా జరుగుచున్నది. ఇటువంటి కార్యముల కొరకు దశలు, దశాచారములని ప్రత్యేక విభాగమున్నదని చెప్పుకొన్నాము. దశాచారములో మంచి చెడు దశలు, జ్ఞాన అజ్ఞానములనుబట్టి కర్మను సవరించుటకు తయారు చేయబడినవి. గ్రహచారము ప్రకారము మంచి ఫలితములు వచ్చునప్పుడు, మంచి కర్మ అమలు జరుగుచున్నప్పుడు, మంచి కర్మను అమలు చేయునవి పన్నెండు గ్రహములలోని ఆరు గ్రహములు. ఆరు గ్రహములు ఒక గుంపుగా మరొక ఆరు గ్రహములు మరొక గుంపుగా ఏర్పడి తాము జీవితాంతము చెడుగా ఎవరు ప్రవర్తించాలి (పాపమును ఎవరు పంచాలి) యనీ, అట్లే మంచిగా పుణ్యమును ఎవరు అందివ్వాలని