పుట:Jyothishya shastramu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నక్షత్రములో పూర్వాషాడ 4వ పాదమున ఉన్నట్లు తెలియుచున్నది. ఇప్పుడు వెనుక ఖాళీగాయుంచిన మూడు గ్రహముల నక్షత్రములనూ, వాటి పాదములను గుర్తించుకొందాము.

ఇంతవరకు జన్మలగ్నమునూ, జన్మకుండలిలో గ్రహములు ఏయే పాదములలో ఉన్నదీ, క్రొత్త గ్రహములు ఎక్కడున్నదీ, జాతకుని జనన సమయములో ఏ దశయున్నదీ తెలుసుకోగలిగాము. ఇప్పుడు పన్నెండు గ్రహములు ఏ లగ్నములోయున్నవో, ఏ లగ్నములను తమ చేతులతో తాకుచున్నారో క్రింద తెలుసుకొందాము. అలా వ్రాసుకొని చూచుకోవడము వలన గ్రహములు స్వయముగా ఉన్న స్థానములు ఏవో, దూరమునుండి ఏ గ్రహములను తాకుచున్నవో తెలుసుకొందాము. ఏ జాతకునికైనా జనన లగ్నకుండలి ముఖ్యము. పుట్టినరోజు పన్నెండు స్థానములలోనున్న గ్రహములు జీవితాంతము ఆ స్థానములనుబట్టి వ్యవహరించుచుండును. పన్నెండు గ్రహములలో ఎనిమిది గ్రహములు ముందుకు తిరుగుచుండగా, నాలుగు గ్రహములు వెనక్కు అపసవ్యముగా తిరుగుతూ తన బాధ్యతను నిర్వర్తించుచున్నవి. జనన సమయములో వేరువేరు జాగాలలోనున్న పన్నెండు గ్రహములు తర్వాత వాటి వేగమునుబట్టి అవి వేరువేరు స్థానములలో తిరుగుచున్ననూ జాతకుడు పుట్టిన సమయములో తమకు అప్పగింపబడిన విధి విధానమును మరువక దానిప్రకారమే నడుచుకొనుచూ, కాలగమనములో (గ్రహ గమనములో) ఏ స్థానములోనికి పోయినా