పుట:Jyothishya shastramu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను ఎక్కడా బయట తిరగను, ఎవరితోనూ ఎక్కువగా సంబంధము పెట్టుకోను. ఇప్పుడు కూడా నా గ్రంథములు ఎక్కువగా సమాజములో ప్రచారమైనా నేను ఎవరో కూడా చాలామందికి తెలియదు. అటువంటి నేను తర్వాత 2002వ సంవత్సరము నావెంట జిహ్వానందస్వామి రాగా ఇద్దరము కలిసి ఆ జాతకుని దగ్గరకుపోయి ఆ సంవత్సరము ఆగష్టు నెలలో జరుగు కృష్ణాష్టమి సందర్భముగా జరుగు ఆధ్యాత్మిక సభలో మేము వ్రాసిన ఒక గ్రంథమును ఆవిష్కరించమని అడిగాము. అప్పుడు ఆయన ‘‘ నేను మత సంబంధమైన సభలకు రాను’’ అని చెప్పడము జరిగినది. అంతటితో మేము వెను తిరిగి వచ్చాము. అప్పుడు నా ప్రక్కనున్న మనిషితో ‘‘ఇది దేవునికి దేవుని జ్ఞానమునకు సంబంధించిన సభ. గ్రంథము కూడా అటువంటిదే. ఈ సభకు వచ్చియుంటే ఆయన కర్మలో కొంత మార్పు వచ్చేది’’ అని చెప్పాము. అంతటితో ఆ విషయమును మేము మరచి పోయాము. తర్వాత కొన్ని సంవత్సరములకు 2008 సంవత్సరములో ఆయన ప్రయాణించు హెలిక్యాప్టర్‌ చేరవలసిన స్థలమునకు చేరలేదు, ఏమి జరిగిందో అని కొందరనుకోవడము ఆళ్లగడ్డలో హోటల్‌లో భోజనము చేస్తూ విన్నాము. అప్పుడు నా వెంట పదిమంది నాకు భక్తులైనవారే ఉన్నారు. అప్పుడు నా తలలో 1994వ సంవత్సరములో చూచిన జాతకము జ్ఞాపకము వచ్చినది. నాకు ఆయన ప్రయాణ వార్త దాదాపు 1-20 నిమిషము లప్పుడు తెలిసినది. ఒక నిమిషము ఆలోచించి అది మేము జాతకములో చూచిన ప్రమాదమే అయి ఉంటుందని అనుకొని, ఆ విషయమును నా ప్రక్కనే యున్న మా వారికి చెప్పడము జరిగినది. నేను ఏది అనవసరముగా చెప్పనని తెలిసిన మా భక్తులు నేను చెప్పిన మాటను పూర్తి విశ్వసించారు. ఆయనకు ప్రమాదము జరిగినదని రెండవ రోజు వరకు తెలియకున్నా