పుట:Jyothishya shastramu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము మాత్రము ముందే అది ప్రమాదమే అయివుంటుందనీ, జాతకము ప్రకారము జరిగిన దనీ అనుకొన్నాము. ఈ సంఘటనతో జ్యోతిష్యము పూర్తి సత్యమని మేము తెలుసుకోగలిగాము. నాకు సత్యమని తెలిసిన తర్వాత అదే విషయమునే బయటికి జ్యోతిష్యము సత్యమని చెప్పుచున్నాము.

నాకు తెలిసిన జ్యోతిష్యము ప్రకారము, ఇంతవరకు ఈ గ్రంథములో వ్రాసిన పన్నెండు గ్రహములను ఉపయోగించి ఇప్పుడొక జాతకమును వివరిస్తాను చూడండి. ఈ జాతకుడు పుట్టిన తేదీ, పుట్టిన కాలమును చూస్తే ఇలా కలదు. 21వ తేదీ, డిశంబరు 1972 గురువారం రాత్రి 1-30 A.M సమయములో జమ్మలమడుగులో జన్మించినట్లు కలదు. ఇతను జన్మించిన సమయములో ప్రారబ్ధకర్మ ఎలా నిర్ణయించబడినదో, అతని జన్మలో మొదటనే నిర్ణయించబడిన జాఫతకము అను జీవిత ఫతకము ఏమిటని చూచుటకు ముందు ఖగోళములో ఆ సమయానికి పన్నెండు గ్రహములు ఏది ఎక్కడున్నదో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడమేకాక సూర్యుని కిరణములు కర్మచక్రము మీద ఏ భాగములో పడుచున్నవో తెలియ గలగాలి. ఇదంతా మనము పంచాంగమునుండి గ్రహించవలసియున్నది. అయినా ఈ కాలములో అటువంటి శ్రమ ఎవరికీ అవసరములేదు. అన్ని లెక్కలను కంప్యూటర్‌ చేసి మనకు జాతకుని జన్మ లగ్నము, జాతకునికి గ్రహములు ఏయే లగ్నములందు ఏయే నక్షత్రములలో గలవో, అలాగే నక్షత్రము యొక్క ఎన్నో పాదములో గ్రహముగలదో సులభముగా తెలియు చున్నది. అంతేకాక పుట్టిన సమయములో జాతకుడు ఏ దశలో ఉన్నాడో, జరుగబోవు దశలు ఏవో కూడా తెలియుచున్నది.

ఒక జాతకమును చూడవలసి వచ్చినప్పుడు జ్యోతిష్యుడు అతను పుట్టిన (జాతకుడు పుట్టిన) కాలమును ఆధారము చేసుకొని మొదట లగ్న