పుట:Jyothishya shastramu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుండలియందున్న పన్నెండు లగ్నములలో ఏ లగ్నము జన్మలగ్నమగు చున్నదో తెలియవలెను. జన్మ లగ్నమును తెలియుటకు జాతకుడు పుట్టిన సమయము 1972-12-21వ తేదీ రాత్రి 1-30 నిమిషములకు అయినప్పుడు ఆ దినము సూర్యోదయము 6-42 నిమిషములకు జరిగినది. పంచాంగము ప్రకారము ఆ దినము సూర్యుడు మూల 2వ పాదములో ఉండుట వలన మూల నక్షత్రముగల ధనుర్‌ లగ్నము ఉదయమున్నదని తెలిసినది. ధనుర్‌ లగ్నము తెల్లవారకముందే 27 నిమిషములు గడచిపోయినది. తెల్లవారిన తర్వాత మిగిలిన ధనుర్‌లగ్నము 1-40 నిమిషములు.