పుట:Jyothishya shastramu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మారిపోవడము జరిగినది. అటువంటి సందర్భములో కేరళ రాష్ట్రములో పుట్టిన శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతమును స్థాపించి హిందూమతములో నుండి బౌద్దులుగా మారిపోకుండ కొంత అడ్డుకట్ట వేశాడు. తర్వాత కొంత కాలమునకు అద్వైత సిద్ధాంతముకంటే మెరుగైన సిద్ధాంతముగా విశిష్టాద్వైత సిద్ధాంతమును తమిళనాడునుండి రామానుజాచార్యులు ప్రచారము చేశాడు. తర్వాత కొంతకాలమునకు కర్ణాటక రాష్ట్రమునుండి మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. ఈ మూడు సిద్ధాంతములు హిందూ మతములోనివే. అద్వైతులు అడ్డనామములను, విశిష్టాద్వైతులు నిలువు నామములను ముఖాన గుర్తుగా ఉంచుకోగా, ద్వైతులు కుంకుమ బొట్టును ధరించారు. అద్వైతులు విభూతిరేఖలను, విశిష్టాద్వైతులు సపేదతో తెల్లనామమునూ, గంగ సింధూరముతో ఎర్ర నామమును తమ సిద్ధాంతము లకు గుర్తుగా ఫాల భాగములో ధరించారు. ప్రస్తుత కాలములో ప్రబోధానంద యోగీశ్వరులుగా త్రైత సిద్ధాంతమును ఇప్పటికి 35 సంవత్సరముల క్రిందటే ప్రకటించి, భగవద్గీతను ముఖ్యముగా ప్రచారము చేయడమేకాక, అద్వైతము లో ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యములను చెప్పుచూవచ్చాము. వాటినే యాభై గ్రంథములుగా వ్రాశాము.

హిందూమతములో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతమును ప్రకటించిన సిద్ధాంతకర్తలు ముగ్గురూ లేరు. త్రైత సిద్ధాంతమును ప్రకటించిన మేము ప్రత్యక్షముగా బ్రతికేయున్నాము. చరిత్రను తెలిసిన మేము మనము మొదట కలియుగములోనే ఇందువులము. నేడు హిందువులుగా చెప్పు కొంటున్నాము. అయితే పెద్దలు పెట్టిన దానిని తీసివేయకూడదని హిందూ అనుచోట ఇందూ అని వ్రాస్తే, మమ్ములను ఏకంగా పరాయి మతము అనువారు నేడు హిందువులలో తయారైనారంటే, మన మతమును