పుట:Jyothishya shastramu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృత యుగములోనే భారతదేశమునకు ఇందూదేశమని నామకరణము చేశారు. ఆ పేరు కాలక్రమములో కొంత మార్పుచెంది ఇందు అను శబ్దమును హిందూ అని చెప్పుచూ పలుకుచున్నాము. అలా పలుకుట వలన ఇందూ దేశము కాస్తా హిందూదేశముగా వ్రాయబడుచున్నది మరియు పిలువబడుచున్నది. ఇందూ అంటే జ్ఞాని అని అర్థముకలదుగానీ, హిందూ అంటే ఆ పదమునకు అర్థమేలేదు. మేము జ్యోతిష్యశాస్త్రమును తెలిసి మరియు బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలిసి, మన దేశ చరిత్ర యుగపర్యంతము తెలిసి, కృతయుగములోనే జ్ఞానులదేశమని పేరుగాంచిన దేశమని ఆ దినము పెద్దలు నిర్ణయించిన ఇందూదేశము అను పేరును చెప్పుచూ, మనము ఇందువులమని చెప్పితే విషయమును గ్రహించుకొను స్థోమతలేని వారు హిందూధర్మరక్షకులమని పేరు పెట్టుకొన్నవారై ఇందూ మతము పరాయి మతము అంటున్నారు.

కృతయుగమునాడే ఈ దేశములోని వారంతా జ్ఞానులుగాయుండి ఇందువులని పేరుగాంచియున్నారు. ఆనాడు వేరే మతమంటూ లేదు. కావున ఇందూమతమని కూడా పేరులేదు. ఉన్నవారంతా ఇందువులే. అయితే కలియుగములో రెండు వేల సంవత్సరముల పూర్వము బుద్ధుని బౌద్ధమతము వచ్చిన తర్వాత దానిని బౌద్ధమంటున్నాము కాబట్టి గుర్తింపు కొరకు దీనిని కూడా ఇందూ (హిందూ) మతమన్నారు. అప్పటికే ఇందూ హిందూగా మారిపోయినది. బౌద్ధమతము బాగా ప్రచారములోనున్న రోజు లలో, అశోకచక్రవర్తియే హిందూ మతమును వీడి తనను బౌద్ధమతస్థునిగా ప్రకటించుకోగా, అశోకుని కొడుకు కూతురు శ్రీలంక, అప్ఘనిస్థాన్‌ మొదలగు దేశములలో ప్రచారము చేయగా, స్వయముగా అశోకుడే బౌద్ధమత వ్యాప్తికి కృషి చేయగా, ఆనాడు ఎందరో జ్ఞానములేని హిందువులు బౌద్ధులుగా