పుట:Jyothishya shastramu.pdf/232

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వ్రాసినది. అప్పుడు కర్మప్రకారము జరుగు విషయములే వ్రాయవచ్చును. జ్ఞానము వలన మధ్యలో మారిపోవు విషయములను ముందే వ్రాయుటకు వీలుపడదు. ఈ విధముగా చాలామంది ఆయుష్షు ముందుకు వెనక్కు పోయిన సందర్భములు కలవు. అందువలన ఆయుష్షు విషయమును చెప్పుటకు ఇటువంటి చిక్కు సమస్యలున్నాయని ముందే చెప్పాము.

44. ఇందు (హిందు)వులది జ్యోతిష్యము

ద్వాదశ గ్రహములలో జ్ఞానమునకు అధిపతి చంద్రుడు. చంద్ర గ్రహముతోగానీ, చంద్ర కిరణములతోగానీ సంబంధములేకుండ ఎవరికీ జ్ఞానము లభించదు. త్రిమూర్తులలో ఒకడైన శివుడు భిక్షాటన చేయువాడైనా తన శిఖలో చంద్రవంకను ఉంచుకొన్నాడు. శివుడు చంద్రవంకను శిఖలో పెట్టుకోవడము అలంకారమునకని కొందరనుకొనియుండవచ్చును. అయితే శివుడు చంద్రవంకను అలంకారభూషణమునకు ఆయన చంద్రవంకను తలమీద పెట్టుకోలేదు. జ్ఞానమునకు గుర్తుగా చంద్రున్ని తలమీద పెట్టు కోవడము జరిగినది. తల జ్ఞానమునకు నిలయము. జ్ఞానమునకు చంద్రుడు చిహ్నము. అందువలన తలమీదనే చంద్రున్ని జ్ఞానగుర్తుగా శివుడు పెట్టుకొని చూపించడము జరిగినది. పూర్వము దైవజ్ఞానము గల్గినవారు అన్ని ప్రపంచ దేశములలోకెల్ల ఒక్క భారతదేశములో మాత్రము ఉండెడివారు. అందువలన కృతయుగములోనే ఈ దేశమును జ్ఞానులదేశము అనెడి వారు. చంద్రున్ని జ్ఞాన చిహ్నముగా జ్యోతిష్యములో చెప్పడమువలన జ్ఞానుల దేశమైన ఈ దేశమునకు (భారతదేశమునకు) చంద్రుని దేశమని పేరు ఉండెడిది. చంద్రున్ని ఇందువు అని పిలిచెడివారు. ఇందువు అంటే జ్ఞాని అని లేక చంద్రుడని అర్థము. అందువలన పెద్దలందరూ బాగా యోచించి