పుట:Jyothishya shastramu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుర్తించలేని గ్రుడ్డివారుగా ఎంత అజ్ఞానములో కూరుకుపోయామో! మీరే ఆలోచించండి. త్రైత సిద్ధాంతము అంటూనే ఇది త్రిత్వము అను చెప్పు క్రైస్తవులదనీ, త్రైత సిద్ధాంత భగవద్గీతను చూచి ఇది క్రైస్తవుల భగవద్గీతయని అనేవారిని చాలామందిని చూచాము. భగవద్గీత పేరును అడ్డము పెట్టుకొని పరమతమును ప్రచారము చేయుచున్నారని మమ్ములను అనేవారు నేడు హిందువులలో ఉన్నారంటే, చెప్పే జ్ఞానము ఏది అని గుర్తుపట్టలేని అజ్ఞాన దశలో నేడు హిందువులు ఉండిపోయారని అర్థమగుచున్నది. ఇట్లేయుంటే హిందూ మతము పూర్తి అజ్ఞానములో కూరుకుపోతుందనీ, అట్లు కాకుండు టకు మేము ‘‘దేవాలయ రహస్యములు’’, ‘‘ఇందూ సాంప్రదాయములు’’ అను పేర్లుగల్గిన గ్రంథములను, భగవద్గీతను ఇల్లిల్లు తిరిగి ప్రచారము చేయుచున్నా మీరు మా ఊరిలో ప్రచారము చేయవద్దండి అని వాదమునకు దిగి, చెప్పిన దానిని ఏమాత్రము వినకుండా మమ్ములను అవమానముగా మాట్లాడినవారు కలరు. ఇదంతయు సాధారణ మనుషులు ఎవరూ చేయలేదు. మమ్ములను ప్రతిఘటించిన వారందరూ, మేము హిందూ ధర్మములను రక్షిస్తామని పేరుపెట్టుకొన్నవారే అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. మా కళ్ళ ముందరే ఇంత అజ్ఞాన స్థితిలోనికి పోయిన హిందువులకు పూర్తి జ్ఞానమును కల్పించి, అన్ని మతముల ముందర ఇందూ (హిందూ) జ్ఞానము గొప్పదని అనిపించుటకు కృషి చేయాలనుకొన్నాము. ఆ పద్ధతిలో నేడు మమ్ములను కూడా పరమతమని ద్వేషించినవారు కళ్ళు తెరచి హిందూ (ఇందూ) జ్ఞానము ఎంతో గొప్పదని అర్థము చేసుకొనునట్లు ఇంతవరకు భూమిమీద ఎవరూ చెప్పని గ్రంథములను వ్రాసి ఇచ్చాము. ఇప్పుడు ‘‘జ్యోతిష్య శాస్త్రము’’ అను గ్రంథమును కూడా అందిస్తున్నాము. ఈ గ్రంథమును అందివ్వడములో మీరందరూ తెలుసుకోవలసినదేమనగా!