పుట:Jyothishya shastramu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయాడని అనుకొందుము. కానీ ఇక్కడ పది సంవత్సరములు ఎక్కువ బ్రతికాడు కదా! దానికి మీరేమంటారు.’’ అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా గలదు.

ఏ మనిషికైనా ప్రపంచ విషయములలో ప్రవర్తించు ప్రవర్తనను గురించి ప్రారబ్ధకర్మ ఏర్పరచబడియుండును. గ్రహచారము ప్రకారము ఒక్క క్షణము కూడా కర్మ వదలక మనిషిని నడుపుచుండును. కర్మప్రకారము దేవున్ని తెలియుటకుగానీ, దేవుని జ్ఞానము తెలియుటకుగానీ, దేవుని జ్ఞానము మీద శ్రద్ధకల్గుటకుగానీ కర్మ కారణము కాదు. అటువంటపుడు కర్మకు అతీతముగా దేవునివైపు మనిషి పోవుటకు తగినట్లు గ్రహముల దశలను దేవుడు ఏర్పరచాడు. గ్రహముల దశాకాలములో మిత్ర శత్రుగ్రహములు మనిషి దేవునిమీద శ్రద్ధకల్గి దైవమార్గములో ప్రయాణించుటకు ఆయా గ్రహములు తమ తమ కర్మలను లేకుండ చేయవచ్చును. కర్మను పాలించు నవి గ్రహములే కావున జ్ఞానమునుబట్టి, జ్ఞానశక్తిని (జ్ఞానాగ్నిని) బట్టి కర్మలను నిర్మూలించవలసిన కార్యమును చేయవలసిన బాధ్యత గ్రహముల మీదనే ఉన్నది. అందువలన అటువంటి కార్యమును ఆచరించుటకు గ్రహముల దశలు ఏర్పరచబడినవి. గ్రహచారములో రవ్వంత కర్మను కూడా వదలక అనుభవింపజేయు గ్రహములు, తమ దశలలో మాత్రము దేవుని శాసనమును అనుసరించి కర్మను దహించు కార్యము కూడా చేయును. ఇంతకుముందు ఇదే గ్రంథములో ‘‘దశలు అంటే ఏమిటి’’ అను విభాగములో దేవుని విషయములో మనిషి ప్రవర్తననుబట్టి గ్రహములు తమ దశలలో కర్మను తీసివేయవచ్చును లేక తగిలించవచ్చును అని చెప్పియున్నాము. అక్కడ కర్మను తీసివేయు విధానమును గ్రహములే చేయుచున్నవని చెప్పుచూ అక్కడ కర్మలేకుండ పోవుటకు భగవద్గీతలో జ్ఞానయోగమను అధ్యాయమున