పుట:Jyothishya shastramu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పటికి సత్యమే, ఇప్పుడు జరిగినది ఇప్పటికి సత్యమేనని చెప్పవచ్చును. మా మాట విన్న కొందరికి మా మాటలోని సత్యము అర్థముకాక మమ్ములను అసత్యవాదులుగా వర్ణించవచ్చును. అయితే అందరికీ తెలియని సత్యమొకటి కలదు. జాతకుడు పుట్టినరోజు జాతకమునుబట్టి అతను 70 సంవత్సరములు బ్రతుకవలెనని ఉండుట సత్యమే. అయితే 70 సంవత్సరముల జీవితములో అతడు కొంతవరకు దైవజ్ఞానము ప్రకారము నడుచుకోవడము వలన కర్మమారుటకు అవకాశముగల దశా సంవత్సరములో తేడావచ్చి అతని ఆయుష్షు పది సంవత్సరములు పెరిగినది. మొదట శాస్త్రబద్ధముగాయున్నది 70 సంవత్సరముల ఆయుష్షూ సత్యమే, జ్ఞానమువలన కర్మమారి పది సంవత్సరములు పెరిగినదీ సత్యమే. అందువలన జనన లగ్నములో ఉన్నట్లు 70 సం॥ ఆయువు సత్యము. తర్వాత 80 సంవత్సరములు బ్రతుకు కూడా సత్యమే. దశాసంవత్సరములు జీవిత మధ్యకాలములో ఉన్నవి. మనిషి దైవజ్ఞానమును అనుసరించితే, ఆయా గ్రహములు పాలించవలసిన కర్మలు, ఆయా గ్రహముల యొక్క దశలలో నశించి పోగలవు. అందువలన మొదట పుట్టినప్పుడు నిర్ణయించబడిన కర్మకూ తర్వాత మధ్యకాలములో మార్పుచెందిన కర్మకూ తేడాయున్నది. జ్ఞానము ప్రకారము కర్మ తగ్గిపోయినదని అర్థము చేసుకోవచ్చును కదా! యని మేము చెప్పుచున్నాము. అయితే మా మాట విన్న తర్వాత కొందరు ఇలా ప్రశ్నించవచ్చును. ‘‘జ్ఞానము తెలియగల్గి దాని ప్రకారము ఆచరించితే గీతలో చెప్పినట్లు కర్మతగ్గిపోవు మాట వాస్తవమే అయితే దానిని మేము ఒప్పుకుంటున్నాము. ఆ లెక్క ప్రకారము 70 సంవత్సరములు బ్రతుకవలసిన వాడు 65 సంవత్సరములకో లేక 60 సంవత్సరములకో చనిపోయాడంటే, కర్మ తగ్గిపోయినందుకు అలా ఆయుష్షు కూడా తగ్గిపోయి ముందే