పుట:Jyothishya shastramu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పిన 37వ శ్లోకమును కూడా చెప్పాము. ఆ శ్లోకమునుబట్టి జ్ఞానమను అగ్నిచేత కర్మలను దహించు కార్యమును గ్రహములే చేయుచున్నవి. అంతేకాక దేవుని విషయములో భక్తి శ్రద్ధలకు బదులు దేవున్ని ద్వేషించుట, దూషించుట చేసినవారికి లేని కర్మలను అనుభవించునట్లు చేతునని భగవద్గీతయందు దైవాసుర సంపద్విభాగయోగమున 18,19 శ్లోకములను చూస్తే తెలియుచున్నది. ప్రపంచ విధానములో కాకుండ దేవుని మార్గములో లేని కర్మలను గ్రహములే తగిలించవలసియున్నది. అందువలన గ్రహచారములో మనిషి దేవునిపట్ల ప్రవర్తించు దానినిబట్టి కర్మను తీసి వేయుటకుగానీ, కర్మను తగిలించుటకుగానీ గ్రహములే కర్తలు. అటువంటి దైవ కార్యములను గ్రహములే తమ దశలయందు చేయుచున్నవి.

ఒక మనిషి కర్మ ప్రకారము ప్రపంచ విషయములలో అస్వతంత్రుడై ప్రవర్తించవలసియుండును. అదే దైవము యొక్క విషయములో స్వతంత్రముగా ప్రవర్తించగలడు. దేవుని విషయములు కర్మ ఆధీనములో ఉండవు. అందువలన జీవుడు దేవునికి స్వయముగా దగ్గరగా పోవచ్చును. లేక దూరముగా కూడ పోవచ్చును. దేవునికి దగ్గరగా పోయినవానికి ఉన్న కర్మలు లేకుండ గ్రహముల చేతనే తీసివేయబడును. అలాగే దేవునికి దూరముగా పోయినవానికి లేని కర్మలను గ్రహముల చేతనే తగిలించ బడును. ఆ రెండు పనులను గ్రహములు తమ దశలలో చేయుటకు అవకాశము కలదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. పుట్టిన కాలములో (జాతకములో) ఒక వ్యక్తికి 70 సంవత్సరముల ఆయుష్షున్నదని చెప్పబడినప్పుడు ఆ మాట జ్యోతిష్యశాస్త్రమునుబట్టి సత్యమేనని చెప్పవచ్చును. అయితే ఆ వ్యక్తి తన ఇచ్చతో దేవుని జ్ఞానమును తెలిసి యోగియై జ్ఞానశక్తిని సంపాదించుకొన్నట్లయితే, ఆ మనిషి దేవునికి దగ్గర