పుట:Jyothishya shastramu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక్కడ పన్నెండు గ్రహముల యొక్క వారముల పేర్లు (దినముల పేర్లు) తెలిసిపోయినవి. గ్రహముల మిత్ర శత్రుత్వములనుబట్టి ఎవరికి ఏ దినము అనుకూలమైనదో, ఏ దినము అనుకూలము కానిదో తెలుసు కోవచ్చును.

ఒక వ్యక్తికి శుభ గ్రహములు (మిత్ర గ్రహములు) ఏవో, అశుభ గ్రహములు (శత్రు గ్రహములు) ఏవో తెలియాలంటే అతని జాఫతకము తెలియాలి. అతని జాఫతకము (జాతకము) తెలియుటకు తప్పనిసరిగా అతని పుట్టిన తేదీ, పుట్టిన సమయము ఉండాలి. పుట్టిన తేదీని బట్టి ఆ