పుట:Jyothishya shastramu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారమున్నట్లు, ప్రతి వారము (దినము) నకు ఒక నక్షత్రము కలదు, అలాగే ఒక తిథియ కలదు. వారము అందరికీ తెలుసు. అయితే కొందరికి తిథి నక్షత్రములను గురించి తెలియదు. నేడు కాలేజీలలో విద్యనభ్యసించిన వారికి వీటిని గురించి తెలుసుకొను అవకాశము లేదు. కనుక నేటి యువకులకు తిథి నక్షత్రములు తెలియవనియే చెప్పవచ్చును. తిథి, వార, నక్షత్రములను గురించి నేటి యువకులలో కొందరికి తెలియకున్నా పెద్దలందరికీ చాలామందికి తిథి, వార, నక్షత్రములను గురించి తెలుసు. ఇక యోగ, కరణ అనువాటి విషయమునకు వస్తే వాటి విషయము చాలామంది పెద్దలకు కూడా తెలియదనియే చెప్పవచ్చును. ఒకవేళ కొందరికి వీటి విషయము తెలిసియున్నా వాటి అసలైన భావము ఏదో తెలియదు. ఈ విషయములో నాకు కూడా సరిగా తెలియదనియే చెప్పుచున్నాను. ఎందుకనగా! యోగ, కరణ విషయములో రెండు భావములు కలవు. పంచాంగము, జ్యోతిష్యము తెలిసిన వారికి యోగము కరణము అనగా ఒక రకముగా తెలిసియున్నవి. పంచాంగములోనున్న యోగ, కరణ అను రెండు కాలక్రమమున వాటి అర్థములు, సంఖ్యలు, పేర్లు అన్నీ మారిపోయియున్నవి. మొదట జ్యోతిష్యము కొరకు తయారు చేసిన యోగ, కరణములు వేరు, నేడు కొందరికి మాత్రము తెలిసిన యోగ, కరణములు వేరని చెప్పవచ్చును. నేడు కొందరికి తెలిసిన యోగ కరణముల పేర్లు, సంఖ్యలు ఇలా గలవు.

యోగములు :- మొత్తము = 27, వాటి పేర్లు వరుసగా 1.విష్కంభము 2. ప్రీతి 3. ఆయుష్మాన్‌ 4.సౌభాగ్యము 5. శోభనము 6. అతిగండము 7. సుకర్మము 8. ధృతి 9. శూలము 10. గండము 11. వృద్ధి 12. ధ్రువము 13. వ్యాఘాతము 14. హర్షణము 15. వజ్రము