పుట:Jyothishya shastramu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. సిద్ధి 17. వ్యతీపాత్‌ 18. వరియాన్‌ 19. పరిఫమ 20. శివము 21. సిద్ధము 22. సాధ్యము 23. శుభము 24. శుభ్రము 25. బ్రహ్మము 26. ఇంద్రము 27. వైధృతి. ఈ 27 యోగములను కొన్ని గ్రంథములలో వ్రాసియున్నారు. వాటినే మేము సేకరించి ఇక్కడ చూపాము. ఇవి ఏవో, ఎందుకున్నాయో, వీటి ప్రయోజనమేమో నాకు మాత్రము కొంచెము కూడ తెలియదు.

ఈ యోగములు 27యని వాటి పేర్లతో కూడా వ్రాసినవారు ఇదే పద్ధతిలోనే కరణములను కూడా వ్రాశారు. వారికి తెలిసిన విధానములో కరణములు 11 యని చెప్పుచూ వాటి పేర్లను కూడా ఇలా చెప్పారు. కరణములు మొత్తము (11) పదకొండు. వాటి పేర్లు వరుసగా ఇలా గలవు. 1. బవ 2. బాలవ 3. కౌలవ 4. తైతుల 5. గరజి 6. వరాజి 7. భద్ర 8. శకుని 9. చతుష్పాత్‌ 10. నాగవము 11. కింస్తుఘ్నము.

27 యోగములతోపాటు 11 కరణములను కూడా కొన్ని గ్రంథములలో వ్రాసియున్నారు ఇవి కూడా ఎందుకున్నాయో, వీటి ప్రయోజనము ఏమిటో నాకు ఏమాత్రము తెలియదు. నా మాటను విన్న కొందరికి ఆశ్చర్యము కలిగి పంచాంగములో భాగములైయున్న యోగ, కరణములను తెలియదని చెప్పుచున్న మీరు, జ్యోతిష్యశాస్త్రమును ఎలా వ్రాయుచున్నారు? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! యోగము కరణములనగా నా భావములో వేరు అర్థము కలదనీ, అవి ఇవి కావు అని అనుకొనుచున్నాను. ఇతరులకు తెలిసిన యోగ, కరణములు నాకు తెలియవు. నాకు తెలిసిన యోగ కరణములు ఇతరులకు తెలిసియుండక పోవచ్చును. ఇతరులకు తెలిసినా, తెలియకున్నా