పుట:Jyothishya shastramu.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తెలియని అనేకములు గలవు. మనము కొంత వరకు చెప్పుకొన్నాము. అయితే అనుభవమునుబట్టి ఇంకా కొన్ని విషయములను తెలియవలసి యున్నది. జ్యోతిష్యశాస్త్రములో పరిశోధనలు జరుగడములేదు. అందువలన ఈ శాస్త్రము మిగత నాలుగు శాస్త్రములవలె అభివృద్ధి చెందలేదని చెప్పవచ్చును. అభివృద్ధి చెందనిది ఒక లోపమైతే, ఉన్నది కూడా కాల క్రమములో లేకుండా పోవడమూ, మార్పుచెంది పోవడమూ మరియొక లోపము. అందువలన జ్యోతిష్యము శాస్త్రమువలె కనిపించక కొందరి దృష్ఠిలో మూఢనమ్మకముగా కనిపించుచున్నది. మిగతా శాస్త్రములైన గణిత, ఖగోళ, రసాయన, భౌతికశాస్త్రములలో పరిశోధన జరిగినట్లు జ్యోతిష్య శాస్త్రములో పరిశోధన జరగలేదని అందరికీ తెలుసు. అయితే ఉన్న విషయములు కూడా కాలక్రమములో మార్పుచెంది వేరుగా మారిపోయినవని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయములు అవసరము లేకున్నా తెలుసుకోవడము మంచిది. అలా తెలుసుకోవడము వలన మిగతా విషయములైనా మారకుండ ఉండవచ్చును.

42. యోగము, కరణము అనగానేమి?

పంచాంగమును విభజించితే ఐదు భాగములుగాయున్నదని ముందే చెప్పుకొన్నాము. పంచాంగములో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము అను ఐదు భాగములున్నా ఇవియే పంచాంగములు అని చాలామందికి తెలియదు. ఈ ఐదు భాగములలో నక్షత్రము జ్యోతిష్యమందు ముఖ్యపాత్ర పోషించుచున్నదని కూడా వెనుక పేజీలలో చెప్పుకొన్నాము. వారము అంటే ఏమిటో అందరికీ తెలుసు. ప్రతి దినము ఏదో ఒక వారము పేరు వస్తున్నది. దినము పేరును వారము అంటున్నాము. ప్రతి దినము ఒక