పుట:Jyothishya shastramu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చీకటిలోనున్న నిద్రకు అధిపతిగాయున్నది. అంతేకాక నిద్రలోవచ్చు తలనొప్పి, నిద్రలేమి, మానసిక వ్యాధులు మిత్ర గ్రహమువలననే కల్గును. ఆత్మజ్ఞానమునకు మిత్ర దారిచూపును. స్వప్నములు కూడా మిత్ర ఆధీనములో ఉన్నవేనని తెలియవలెను. నిద్రలోని కదలికలు, స్వప్నములోని కదలికలకు మిత్ర గ్రహమే కారణము.

చిత్ర

మనిషి అకాల మరణము పొందిన తర్వాత, జీవుడు బ్రతికియుండి పరకాయ ప్రవేశము చేయడమును (మరొక శరీరములో చేరుటను) ఆ శరీరములో ఎంతకాలముండవలెనను విషయమును చిత్రగ్రహము సూచించును. సూక్ష్మశరీరముతోయుండి ఎవరిలోనికీ చేరక ఉండు విషయమును సూక్ష్మముగాయున్న కాలములో జ్ఞానము పొందు అవకాశమును చిత్రగ్రహము సూచించును. ఒకవేళ చిత్రగ్రహము శత్రువైతే ఎవరిలోనూ చేరకయుండడము, మిగతా సూక్ష్మములచేత బాధింపబడడము జరుగుచుండును. చిత్రగ్రహము అకాలమృత్యువునూ, తాత్కాలిక మరణమును కూడా సూచించును. సూక్ష్మశరీరముతోనున్న సమయములో మనోబాధలు లేకుండా జ్ఞానచింతలోయుండునట్లు చిత్రగ్రహము చేయగలదు. చిత్రగ్రహము అదృశ్యముగాయుండి దినములో కొన్ని నిమిషములు మాత్రము కనిపించునను సూచనగా సూక్ష్మశరీరము అదృశ్యముగాయుండి కొంత సమయము మాత్రము ఇతరులలో చేరి బయటికి తెలియునట్లు చేయుచున్నది.

పన్నెండు గ్రహముల ఆధీనములోనున్న విషయ, వస్తు సముదాయమును తెలుసుకొన్నాము. గ్రహముల ఆధీనములో ఇంకా మనకు