పుట:Jyothishya shastramu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగములలో మొత్తము 27 నక్షత్రములు గలవు. కాలచక్రములోని పన్నెండు భాగములకు మేషము మొదలుకొని మీనము వరకు పన్నెండు పేర్లు గలవు. అలాగే నక్షత్రములకు కూడా పేర్లు గలవు. 27 నక్షత్రములకు వరుసగా నున్న పేర్లను చెప్పుకొందాము.

ఈ విధముగా మొత్తము 27 నక్షత్రముల పేర్లు కలవు. 27 నక్షత్రములు కాలచక్రములోని పన్నెండు భాగములలో ఇమిడిపోవుటకు అనుకూలముగా ఒక్కొక్క నక్షత్రము నాలుగు భాగములుగా విభజింపబడి నది. ఒక నక్షత్రము నాలుగు భాగములుగా ఉంటూ కాలచక్రములోని అన్ని లగ్నములలో సమానముగా ఇమిడిపోయాయి. కాలచక్ర లగ్నములకు పేర్లున్నవి. అలాగే నక్షత్రములకు పేర్లున్నవిగానీ నక్షత్ర భాగములకు విడిగా పేర్లు లేవు. పేర్లకు బదులుగా భాగములను విడి అక్షరములతో గుర్తించారు. నక్షత్రములలో మొదటి నక్షత్రము అశ్వని నాలుగు భాగములుగా ఉన్నది. ఆ నాలుగు భాగములను అశ్వనీ నక్షత్ర పాదములని అంటున్నాము. ఈ విధముగా అన్ని నక్షత్రములకు నాలుగు పాదములు గలవు. మొత్తము 27 నక్షత్రము లకు 108 పాదములుగలవు. 108 నక్షత్రపాదములు