పుట:Jyothishya shastramu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూర్యుడు గ్రహముల కుటుంబ పెద్దగా ఉండడమేకాక, కర్మను పాలించడము లో రాజు అని పేరుగాంచియున్నాడు. మనిషి (జీవుని) కర్మను అమలు చేయుటకు విధివిధానములన్నిటిని సూర్యుడు ఏర్పరచి పెట్టాడు. అందు వలన కర్మ పాలనలో రాజు సూర్యుడు అని చెప్పవచ్చును. కర్మ పాలనలో గ్రహచారము, దశాచారము అని రెండు విధానములను ఏర్పరచి అందులో గ్రహచారము నకు పెద్దగా సూర్యుడుండగా, దశాచారమునకు పెద్దగా చంద్రుడు కలడు.

కాలచక్రములో ద్వాదశ గ్రహములు నిత్యము ఎడతెరపి లేకుండా సంచరించుచున్నప్పటికీ, వాటి వేగములతో ముందుకు పోవుచున్నప్పటికీ, సూర్యున్ని అనుసరించి రాత్రి (నిద్ర) సమయములో కర్మలను అమలు చేయడము లేదు. సూర్యుడు కాలచక్రములో కుటుంబ యజమాని హోదాను కల్గియుండడమేకాక, కర్మచక్రములోని కర్మపాలనలో రాజు హోదా కల్గి యున్నాడు. కర్మపాలన రెండు విభాగములుగా ఉండుట వలన, ఒక భాగమైన గ్రహచారమునకు తాను రాజుగా ఉంటూ, రెండవ భాగమైన దశాచారమునకు చంద్రున్ని మంత్రి హోదాలో అధిపతిని చేశాడు. ఈ విధముగా కాలచక్రములో యజమాని కుటుంబ పెద్ద అయిన సూర్యుడు, కర్మచక్రములో రాజుగా ఉండడమేకాక, చంద్రున్ని మంత్రిగా ఉంచుకొన్నాడు. దీనినిబట్టి కాలచక్రములో ఒకరు పెద్దకాగా, కర్మచక్రములో ఇద్దరు పెద్దలు కలరని చెప్పవచ్చును.

36. గ్రహచారము, దశాచారము అంటే ఏమిటి?

ఈ రెండు పద్ధతులు సులభముగా అర్థమగుటకు ఒక ఉదాహరణను తీసుకొందాము. ఒక వ్యక్తి ఎండాకాలము కాలినడకన ప్రయాణము